పవన్ కల్యాణ్‌పై ప్రధాని మోదీ సీరియస్.. మరోసారి అలాంటి పని చేయకు అంటూ స్వీట్ వార్నింగ్!
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం మహా జోరుగా సాగుతున్నది. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు తమ హామీలు, మ్యానిఫెస్టోల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంకా వారం రోజులు గడువు ఉండటంతో ప్రచార హోరును ఆంధ్రాలో పెంచారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తూ.. కూటమి విజయం కోసం శ్రమిస్తున్నారు. తాజాగా ఏపీ పర్యటనలో పవన్ కల్యాణ్‌ను మోదీ ప్రేమతో మందలించిన విధానం అందర్నీ ఆకట్టుకొన్నది. ఆ వివారాల్లోకి వెళితే..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాదారంగా ఆహ్వానించారు. ఆయనకు ప్రేమతో వందనం చేశారు. అందుకు ప్రతీగా మోదీ అంతకు మించిన ప్రేమతో రెండు చేతులెత్తి అభివాదం చేశారు. దాంతో వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఓ వైరల్ వీడియోలో స్పష్టమయ్యాయి.

ఇక రాష్ట్రానికి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ మోదీకి శాలువాతో సన్మానించారు. తన అభిమానాన్ని చూపిస్తూ ఆయన భుజాల మీదుగా ఎంతో ప్రేమతో పవన్ కల్యాణ్ శాలువాను సవరించి అభివాదం చేస్తూ కప్పారు. తనపై చూపించిన ప్రేమను స్వీకరిస్తూ.. పవన్ రెండు చేతులు పట్టుకొని.. తన తలను ఆయన చేతుల్లో పెట్టి జనసైనికుడికి తన అభిమానాన్ని ప్రదర్శించారు.

అనంతరం మోదీ కాళ్లను మొక్కారు. ప్రేమతో తన కాళ్లను తాకడంతో ప్రధాని ఓ క్షణం నిర్ఘాంతపోయారు. అలాగే ప్రధాని ఒంగి పవన్‌ను పైకి లేపి.. మరోసారి ఇలాంటి పని చేయకు.. పవన్ అనడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. తన చేతిని చూపిస్తూ.. ఇలాంటి పని చేయకు అంటూ ప్రేమగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రస్తుతం ప్రధాని, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన ఈ సన్నివేశం సోషల్ మీడియాను ఊపేస్తున్నది. ఈ వీడియో అన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. ఇప్పటికే పలుమార్లు పవన్ కల్యాణ్‌పై మోదీ తన ప్రేమను బహిరంగ సభల్లో వ్యక్తీకరించారు. పవన్ అంటే ఆయన హృదయంలో ఎలాంటి స్థానం ఉందో మరోసారి ఈ సన్నివేశం రుజువు చేసింది.


Click it and Unblock the Notifications











