twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడు రాజమౌళి మరో భారీ విరాళం... ఆయన బాటలో ఫ్యాన్స్ కూడా!

    By Bojja Kumar
    |

    బాహుబలి లాంటి భారీ చిత్రాలు తెరకెక్కిస్తూ కోట్లలో రెమ్యూనరేషన్ అందుకునే దర్శకుడు రాజమౌళి సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. తాజాగా ఆయన మరో భారీ విరాళం అందజేశారు. అంతే కాదు.... తన అభిమానులు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనేలా చైతన్య పరుస్తున్నారు. 'ఐ షేర్ మై లంచ్' కాంపెయిన్లో భాగంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ కోసం రాజమౌళి రూ. 23.75 లక్షల విరాళం అందజేశారు.

    Recommended Video

    All Crazy Directors Attends Dinner Meet At Vamshi Paidipally House

    ట్విట్టర్ ద్వారా వెల్లడించిన రాజమౌళి

    2500 మంది స్కూలు పిల్లలకు సంవత్సరం పాటు తాజా, పోషక విలువలతో కూడిన భోజనం అందించేందుకు... మా వంతు సహాయం అందించడం జరిగింది. మీరు కూడా ఇందులో భాగం కావొచ్చు. రూ. 950 విరాళం అందించడం ద్వారా ఒక నిరుపేద స్కూలు విద్యార్థికి సంవత్సరం పాటు భోజనం అందించవచ్చు.... అని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపారు

    అద్భుతమైన కార్యక్రమం

    నిరుపేద విద్యార్థులు ఆకలి కారణంగా చదువుకు దూరం కాకూడదు అనే లక్ష్యంతో అక్షయ పాత్ర ఫౌండేషన్ 20 లక్షల స్కూలు పిల్లలకు భోజనం అందించడం లక్ష్యంగా భారీ మిషన్ ప్రారంభించింది. ఇందులో రాజమౌళితో పాటు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, హీరో పభాస్ ఇతర సినీ సెలబ్రిటీలు భాగం అయ్యారు.

    రాజమౌళి ట్వీట్‌తో మరింత పబ్లిసిటీ

    రాజమౌళి ట్వీట్‌తో మరింత పబ్లిసిటీ

    రాజమౌళి ట్వీట్ ద్వారా ఈ కార్యక్రమానికి మరింత పబ్లిసిటీ కల్పించారు. దీంతో పలువురు ఫ్యాన్స్ తాము కూడా ఈ కార్యక్రమంలో భాగం అవుతామని, తమ వంతు సహాయం అందిస్తామంటూ ముందుకు వచ్చారు.

    సినిమాల విషయానికొస్తే

    సినిమాల విషయానికొస్తే

    సినిమాల విషయానికొస్తే... బాహుబలి-2 తర్వాత ఆయన మరో భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానిని డివివి దానయ్య నిర్మాత. త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోంది.

    English summary
    Baahubali film maker SS Rajamouli took to Twitter and confirmed this news via his tweet. Rajamouli tweeted, “This year, we are sharing our lunch with 2500 school children for an entire year through AkshayaPatra Foundation. You too can be a part by contributing just Rs.950/- and provide hot, nutritious lunch to a school child for an entire year!"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X