»   » పెళ్లి సందడి: నరేష్ ఫ్రెండ్స్ అల్లరి, విరూప ఇంట్లో అలా..(ఫోటోస్)

పెళ్లి సందడి: నరేష్ ఫ్రెండ్స్ అల్లరి, విరూప ఇంట్లో అలా..(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హీరో, యంగ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ వివాహం రేపు(మే 29)న జరుగబోతున్న సంగతి తెలిసిందే. నరేష్ ఇంట్లో పెళ్లి సందడిగా జోరందుకుంది. గురువారం అతన్ని పెళ్లి కొడుకును చేసారు. ఈ సందర్భంగా నరేష్ తోటి హీరోలో...‘వికెట్ డౌన్ అంటూ' టీజ్ చేసారు.

టాలీవుడ్ స్టార్స్, నరేష్ ఫ్రెండ్స్ నాని, నిఖిల్, శశాంక్, తరుణ్, ఖయ్యుం తదితరులంతా చేరి సందడి చేసారు. వీళ్లతో పాటు నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ కూడా సందడిగా గడిపాడు. ఇటీవలే నరేష్ తన స్నేహితులు బ్యాచిలర్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి నరేష్ ఓ ఇంటి వాడు కాబోతుండటంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మే 29న రాత్రి 9 గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహాం జరుగబోతోంది. బంధు, సపరివార సమేతంగా వచ్చి వధూవరులను ఆశ్వీర్వదించాలని నరేష్ సోదరుడు రాజేష్ కోరారు. అల్లరి నరేష్ పెళ్లాడబోతున్న విరూపకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన అమ్మాయి. ఇంగ్లండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ షెఫ్పిల్డ్ నుండి గ్రాజ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఆర్కిటెక్టుగా పని చేస్తోంది.

 వికెట్ డౌన్

వికెట్ డౌన్

పెళ్లైతే మగాళ్ల పని అంతే, వికెట్ డౌన్ అయినట్లే అంటూ....ఫ్రెండ్స్ టీజ్ చేస్తున్న దృశ్యం.

ఎ ఫిల్మ్ బై ఈవివి

ఎ ఫిల్మ్ బై ఈవివి

తండ్రి ఈవివి సత్యనారాయణ వల్లే తన జీవితం ఇంత గొప్పగా ఉందంటూ వివరిస్తూ ఇలా...

 పెద్దలు కుదిర్చిన వివాహం

పెద్దలు కుదిర్చిన వివాహం

వీరిది పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్. అల్లరి నరేష్ కు తగిన జోడీ కోసం గత కొన్ని నెలలుగా కుటుంబ సభ్యులు అన్వేషణ సాగించారు. విరూపతో....మ్యారేజ్ ఫిక్సయింది.

మెహందీ

మెహందీ

విరూప మెహందీ దృశ్యం.

కంటమనేని నివాసం

కంటమనేని నివాసం

విరూప కంటమనేని నివాసం పెళ్లి సందర్భంగా అందంగా అలంకరించారు.

English summary
Naresh Allari Pre Wedding Celebration photos.
Please Wait while comments are loading...