twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ప్రేమఖైదీ'ని మించి పోయే 'బెండు అప్పారావ్'

    By Staff
    |

    అల్లరి నరేష్ కథానాయకుడిగా, ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బెండు అప్పారావ్'. 'ఆర్.యం.పి' అనేది ఉపశీర్షిక. శ్రీ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ చిత్రంలో ఆయన ఆర్.యం.పి డాక్టరుగా చేసే పనులు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయని దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ పేర్కొన్నారు.

    ఇక ఈ చిత్ర నిర్మాత డి.రామానాయుడు మాట్లాడుతూ ఇ.వి.వి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ప్రేమఖైదీని మరిపించే స్థాయిలో ఈ చిత్రం వుంటుందని చెప్పారు. హాస్యంతో పాటు నవరసాలు ఈ చిత్రంలో వున్నాయని, ఖచ్చితంగా ఈ చిత్రం తమ బ్యానర్ కు మంచి పేరు తెచ్చేదిగా వుంటుందని తెలిపారు. ఈ చిత్రంలో నరేష్ సరసన కామ్న జఠ్మలాని, మేఘన కథానాయికలుగా నటిస్తున్నారు.

    ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న ఈ చిత్రం ఆడియో ఈ నెలాఖరున, సినిమాను దసరా కానుకగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. కితకితలు, తొట్టిగ్యాంగ్, ఫిటింగ్ మాస్టర్, అత్తిలి సత్తిబాబు వంటి కామెడీ చిత్రాలని అందించిన ఇ.వి.వి., నరేష్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X