హిట్ లో ఉన్న అల్లరి నరేష్ కి 'బి' పిచ్చి పట్టిందా?
అల్లరి నరేష్ హీరోగా చేసిన బ్లేడు బాబ్జీ, బెండు అప్పారావు ఆర్.ఎంపి రెండు హిట్ సినిమాల టైటిల్స్ 'బి'(B) అక్షరంతో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనకు బి అనే అక్షరంతో మొదలయ్యే టైటిల్స్ బాగా కలిసి వస్తున్నాయనే నమ్మకం కుదిరినట్లుంది. అందుకు తగినట్లుగానే తన తాజా చిత్రానికి 'బెట్టింగ్ బంగార్రాజు' అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. అంతేగాక తర్వాత చేయబోయే చిత్రానికి టైటిల్ సైతం బి అక్షరంతో మొదలైతేనే బావుంటుందని సూచించటంతో ఆ దర్శక, నిర్మాతలు ఆ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇక 'బెట్టింగ్ బంగార్రాజు' చిత్రాన్ని ఉషాకిరణ్ వారు నిర్మిస్తున్నారు. కామిడీ చిత్రాల దర్శకుడు ఇ.సత్తిబాబు డైరక్ట్ చేస్తున్నాడు. సత్తిబాబు గతంలో 'ఓ చినదానా', నరేష్ తో 'నేను' తదితర చిత్రాలు డైరక్ట్ చేసి ఉన్నాడు. ఇక ఈ సినిమా కూడా హిట్టయితే ఇప్పటికే పోటీ లేకుండా దూసుకెళ్ళతున్న అల్లరి నరేష్ ఎదురులేని కామిడీ హీరో అయిపోతాడు. అలా కావాలని, మరిన్ని మంచి కామిడీలు రావాలనే ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











