గమ్యం హిట్ అల్లరి నరేష్ కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అందులోనూ గాలి శ్రీను పాత్ర అతడిలోని నటుడుని వెలికితీసి మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాంటి ఈజీ గోయింగ్ పాత్రతో ఇప్పుడు సత్య మూవీస్ పతాకంపై దేవి ప్రసాద్ దర్శకత్వంలో 'బ్లేడ్ బాబ్జీ' చిత్రం రూపొందుతోంది. నరేష్ ప్రక్కన రుతిక, కౌష, సయ్యలీ భగత్ హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. నిర్మాత ముత్యాల సత్య కుమార్ రెండు పాటలు, పదిరోజుల టాకీ మినహా చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తయ్యాయని, మే నెలలో సినిమాను విడుదల చేస్తామని అంటున్నారు. నరేష్ బాడీ లాంగ్వేజ్‌కి అనుగుణంగా రూపొందుతున్న కామెడి చిత్రమిదని దర్శకుడు తెలిపారు. సయ్యలీ భగత్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, ధర్మవరపు, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరామ్, కొండవలస, ఇత్యాది కామెడీ టీమంతా నటిస్తున్న ఈ చిత్రానికి కోటి సంగీతం సమకూరుస్తున్నారు. దేవి ప్రసాద్ గతంలో ఆడుతూ పాడుతూ, లీలామహల్ సెంటర్ వంటి కామెడీలను అందించి ఉండటంతో సినిమాకు మార్కెట్లో మంచి క్రేజి వస్తోంది.