‘మా’ అవకతవకలు: గతం.. గత అంటూ నరేష్ వివరణ
Recommended Video

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో జరిగిన అవకతవకలపై సంస్థ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శి నరేష్ పరస్పర ఆరోపణలు చేసుకోవడం వివాదానికి కేంద్రంగా మారింది. ఆ వివాదంపై వివరణ ఇవ్వడానికి శనివారం (మా) ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశానికి నిర్మాతలు సురేష్ బాబు, కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, శివాజీ రాజా, నరేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని చెప్పడంతో గందరగోళంగా మారింది.
ప్రపంచంలో ఎన్నో పరిశ్రమలో ఉన్నాయి. సినీ పరిశ్రమ అందులో ఒకటి. బేసిక్‌గా గ్లామర్ పరిశ్రమ కావడంతో పబ్లిక్‌తో ముడిపడి ఉంది. మా సంస్థ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నాం. ఇలాంటి పరిశ్రమ పనిచేసేటప్పడు కొన్ని విభేదాలు, అభ్యంతరాలు వస్తుంటాయి. తప్పులు మానవ సహజం. కాబట్టి అలాంటి వివాదాస్పద సంఘటనలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరించుకోవడానికి కలెక్టివ్ కమిటి ఏర్పడింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా చెప్పేదేమిటంటే.. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు గతం గత:. టాలీవుడ్ సిల్వర్ జూబ్లీ వేడుకను మహానటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫొటోలు పెట్టుకొని నిర్వహిస్తాం.
మా వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి, ముఖ్య సలహాదారుగా సూపర్‌స్టార్ కృష్ణ నేతృత్వంలో పనిచేస్తాం. ఘన విజయం సాధించే విధంగా కృషి చేస్తాం. మహేష్ బాబు ప్రొగ్రాం కూడా నిర్వహించబోతున్నాం.
ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలను బాగా నిర్వహించారని చిరంజీవి కితాబు ఇచ్చారు. భవిష్యత్‌లో నిర్వహించే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు అని నరేష్ చెప్పారు.


Click it and Unblock the Notifications











