twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను రౌడీ అన్నా పర్వాలేదు, రాజశేఖర్ కూతుళ్లే అంతా చేశారు: హేమ

    |

    Recommended Video

    Hema Reveals The Real Facts About Their Winning In MAA Elections | Filmibeat Telugu

    'మా' అధ్యక్షుడిగా ఎన్నికైన నరేష్ ప్రమాణ స్వీకారం విషయంలో మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సహకరించడం లేదని, తన గడువు ఇంకా పది రోజులు ఉందని, పది రోజుల వరకు ఎవరూ ప్రెసిడెంట్ సీటును టచ్ చేయడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారని.. మీడియా ముందుకు వచ్చి చెప్పడం అప్పట్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే.

    ఈ వ్యవహారంపై 'మా' ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన హేమ... తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. దీంతో పాటు ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడానికి, శివాజీ రాజా ప్యానల్ ఓడిపోవడానికి గల కారణం కూడా వెల్లడించారు.

    మీడియాకు వెళ్లాల్సిన అవసరం లేదు

    మీడియాకు వెళ్లాల్సిన అవసరం లేదు

    గెలిచిన ఇతర సభ్యులందరినీ సంప్రదించకుండా ప్రమాణ స్వీకారం విషయంలో శివాజీ రాజా సహకరించడం లేదని మీడియాకు వెళ్లడం తమకు నచ్చలేదని నటి హేమ అన్నారు. మీడియాకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయనకు తెలుసు, కానీ ఎవరినీ కలుపుకోకుండా ఇద్దరు గెలిచిన వారిని, ఇద్దరు గెలవనోళ్లను తీసుకెళ్లి అలా చేశారని, అది సరైన పద్దతి కాదని, కొత్తగా ఎన్నికైన సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి... శివాజీ రాజా ఇలా అంటున్నారు, మనం ఏం చేద్దామని అడిగితే బావుండేదని హేమ తెలిపారు.

    ఆయనేమైనా ఇంట్లో నుంచి ఇస్తున్నారా?

    ఆయనేమైనా ఇంట్లో నుంచి ఇస్తున్నారా?

    ప్రమాణ స్వీకారం రోజున నరేష్ అన్నీ ‘నేను చేస్తున్నాను', ‘నేను మీకు గిఫ్టు మీకు ఇస్తున్నాను'.. అంటూ పలు వరాలు గుప్పించారు. ఆయనేమైనా ఇంట్లో నుంచి తీసుకొచ్చి గిఫ్ట్ ఇస్తున్నారా? అంటూ హేమ ప్రశ్నించారు. ఇది ‘మా' అసోసియేషన్, అందులో మేమంతా సభ్యులుగా సేవచేయడానికి పోటీ చేసి గెలిచి పదవులు దక్కించుకున్నామని, అందరి నిర్ణయం మేరకే ఏ తీర్మాణమైనా జరుగాలని హేమ వ్యాఖ్యానించారు.

    అలా చేయడం పద్దతి

    అలా చేయడం పద్దతి

    నరేష్ తెలిసి చేశారా? ఎగ్జైట్మెంటులో తెలియక చేశారా? ఏమో తెలియదు. ఇతర కమిటీ సభ్యులను సంప్రదించకుండానే ప్రమాణ స్వీకారం సభలో అన్నీ పథకాలు ఎనౌన్స్ చేస్తున్నారు. వాస్తవానికి అలా చేయకూడదు. రాజీవ్ కనకాల కూడా మధ్యలో వెళ్లి మీరు ఇలా అనౌన్స్ చేస్తున్నారు, ఇవి చేయడం ఎలా సాధ్యం? అని వెంటనే వెళ్లి చెవిలో చెప్పారు. ఏ విషయం అయినా ఈసీ మీటింగ్ పెట్టి మెజారిటీ సభ్యులు అమోదం తెలిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి, ఇదీ అసలు పద్దతి అని హేమ తెలిపారు.

    ‘ఈ జనరేషన్లో జూ ఎన్టీఆర్ ఒక్కడే, ముట్టుకుంటే మాడి మసైపోతాం'‘ఈ జనరేషన్లో జూ ఎన్టీఆర్ ఒక్కడే, ముట్టుకుంటే మాడి మసైపోతాం'

    నా మైక్ లాక్కున్నారు

    నా మైక్ లాక్కున్నారు

    నేను మాట్లాడుతుంటే నరేష్ నా మైక్ లాక్కున్నారు. ‘‘మన అందరం ఒకటే నరేష్ గారు, అందరం కలిసి ముందుకు వెళదాం, ఈ విషయాలన్నీ ఈసీలో చర్చించుకుని ఓకే చేసిన తర్వాత ప్రకటిద్దాం'' అని చెప్పడానికే మైక్ తీసుకున్నాను. కానీ నన్ను మాట్లాడనీయకుండా మైక్ లాక్కున్నారని హేమ తెలిపారు.

    నన్ను రౌడీ అన్నా ఫర్వాలేదు

    నన్ను రౌడీ అన్నా ఫర్వాలేదు

    నేను ఏదైనా న్యాయంగా జరుగాలనే ప్రశ్నిస్తాను. ప్రశ్నించే వారిని రెబల్, రౌడీ అంటే అనొచ్చు. అయినా పర్వాలేదు. ‘మా'లోని 800 మందికి మంచి జరుగాలనేది నా తాపత్రయం. అంతకు మించి మరో ఉద్దేశ్యం లేదని హేమ స్పష్టం చేశారు.

    అంతా రాజశేఖర్ కూతుళ్లే చేశారు

    అంతా రాజశేఖర్ కూతుళ్లే చేశారు

    రాజశేఖర్, జీవిత కూతుర్లు ఇద్దరూ 800 మందికి ఫోన్ చేశారు. ఆంటీ, అన్నయ్య, అంకుల్ అని ప్రేమగా పిలుస్తూ ఇలా మా డాడీ నిలబడుతున్నారు, వారి ప్యానల్‌ను గెలిపించండి అని కోరారు. ‘మా' ఎన్నికలపై వీరిద్దరి ప్రభావం బాగా పడింది. చివరి నిమిషంలో నాగబాబుగారు నరేష్ ప్యానల్ వైపు వెళ్లడం కూడా కొంత ఎఫెక్ట్ పడింది. అందుకే శివాజీ రాజా ప్యానల్ ఓడిపోయిందని హేమ తెలిపారు.

    English summary
    MAA vice president Hema revealed that daughters of Jeevitha Rajasekhar are responsible for the victory of Naresh panel in MAA elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X