సూపర్ స్టార్ నరేష్ కొడుకు బర్త్ డే పార్టీ..(ఫోటోలు)
హైదరాబాద్: సీనియర్ తెలుగు సూపర్ స్టార్ కృష్ణ, ఆయన భార్య విజయనిర్మల నటుడు నరేష్ కుమారుడు రణవీర్ తొలి బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. ఈ వేడుకకు వీరితో పాటు జయసుధ, సాయి ధరమ్ తేజ్, ఇతర సినీ రంగ ప్రముఖులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.
నరేష్ ఎవరో కాదు....విజయ నిర్మల తనయుడు. ఆ తర్వాత విజయ నిర్మాల సూపర్ స్టార్ కృష్ణను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నరేష్ తన పేరును తన తల్లి పేరు వచ్చేలా 'విజయ నరేష్'గా మార్చుకున్నారు. ఒకప్పుడు కామెడీ హీరోగా రాణించిన నరేష్ ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేయడం ప్రారంభించారు.
నరేష్ కుమారుడు 'రణవీర్' బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోల స్లైడ్‌షోలో చూద్దాం....

బర్త్ డే పార్టీ
నటుడు నరేష్ కుమారుడు రణవీర్ బర్త్ డే పార్టీకి హాజరైన సూపర్ స్టార్ కృష్ణ దంపతులు. ఈ బర్త్ వేడుక సినీ ప్రముఖులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది.

నరేష్ దంపతులు
పార్టీలో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల. వారి పక్కనే కుమారుడు రణవీర్, భార్యతో కలిసి నరేష్. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

నరేష్
తన ముద్దుల కుమారుడు రణవీర్‌తో కలిసి నరేష్. రణవీర్‌కు ఇది తొలి పుట్టినరోజు కావడంతో చాలా గ్రాండ్‌గా దీన్ని నిర్వహించారు.

జయసుధ, విజయ నిర్మల
నరేష్ కుమారుడు రణవీర్ బర్త్ డే పార్టీకి విజయ నిర్మలతో పాటు నటి జయసుధ కూడా హాజరైన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

సాయి ధరమ్ తేజ్
మెగాస్టార్ మేనల్లుడు, త్వరలో ‘రేయ్' సినిమా ద్వారా తెరంగ్రేటం చేయబోతున్న సాయిధరమ్ తేజ కూడా ఈ బర్త్ డే వేడుకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.


Click it and Unblock the Notifications











