కృష్ణ, మహేష్ బాబు మరో వారసుడి కోసం ఇలా... (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణను హీరోగా పరిచయం కొత్త సినిమా రామానాయుడు స్టూడియలోలో గురువారం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, రామానాయుడు, రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కృష్ణ, మహేష్ బాబు క్లాప్ కొత్తగా, రామానాయుడు, రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేసారు.

ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.10 గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాంప్రసాద్ రగతు దర్శకత్వం వహించనున్నారు. అడ్డాల చంటి, పార్ధసారధి గవర నిర్మాతలు. ఈచిత్రం ద్వారా ఒకప్పటి తార మేనక తనయ కీర్తి కథానాయికగా పరిచయం మరో విశేషం.

కృష్ణ మాట్లాడుతూ...'నవీన్ చాలా టాలెంట్ గల హీరో. నటుడిగా ఫ్రూవ్ చేసుకుంటాడనే నమ్మకం ఉందని తెలిపారు. విజయనిర్మల మాట్లాడుతూ...'మా కుటుంబం నుండి హీరోగా పరిచయం అవుతున్న నవీన్ నటుడిగా తనకంటూ మంచి స్థానాన్ని సంపాదించుకుంటాడనే నమ్మకం ఉంది. నవీన్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

నరేష్ మాట్లాడుతూ...

నరేష్ మాట్లాడుతూ...


పండంటి కాపురం చిత్రం ద్వారా బాలనటుడిగా నా కెరియర్ ప్రారంభమయ్యింది. అప్పుడు నాకు యేడేళ్లు. ఆ తర్వాత పదిహేడేళ్ల వయసులో 'నాలుగు స్థంబాలాట' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాను. అప్పట్నుంచి ఇప్పటిదాకా వెనుతిరిగి చూడలేదు. నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసాను. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై రూపొందిన 'అల్లరి రాముడు' చిత్రం ద్వారా నా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాను. ఆదే బ్యానర్ లో నా తనయుడు హీరోగా పరిచయం అవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్న రాంప్రసాద్ చాలా అనుభవం ఉన్నవాడు. కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్ చేసాడు. చక్కటి ప్లానింగ్ తో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తారని నమ్ముతున్నాను. ఈ చిత్రం ద్వారా అలనాటి ప్రముఖ నటి మేనక తనయ కీర్తి హీరోయిన్ గా పరిచయం అవుతోంది'' అని తెలిపారు.

చంటి అడ్డాల మాట్లాడుతూ....

చంటి అడ్డాల మాట్లాడుతూ....


చంటి అడ్డాల మాట్లాడుతూ - ''మా సంస్థ నుంచి హీరోగా పరిచయం అవుతున్న తొలి హీరో నవీన్. రాంప్రసాద్ చక్కటి కథ ఈ సినిమా కోసం సమకూర్చుకున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. నేను, పార్ధసారథిగారు నాలుగు ప్రాజెక్ట్ లు ప్లాన్ చేసాం. అందులో ఇది తొలి సినిమా'' అని తెలిపారు.

పార్ధసారథి మాట్లాడుతూ

పార్ధసారథి మాట్లాడుతూ


''ఈ సినిమా ద్వారా నవీన్ హీరోగా పరిచయం అవ్వడం ఆనందంగా ఉంది. మేం చేస్తున్న ఈ ప్రయత్నం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు.

స్టార్స్ అండ్ టెక్సీషియన్స్

స్టార్స్ అండ్ టెక్సీషియన్స్


పోసాని కృష్ణమురళి, రవిబాబు, సప్తగిరి, ధనరాజ్, పగ్రతి, వేణు, గబ్బర్ సింగ్ బ్యాచ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం - మహతి సాగర్, ఎడిటింగ్ - త్యాగరాజన్, నిర్మాతలు - చంటి అడ్డాల, పార్ధసారథినాయుడు గవర, దర్శకత్వం - రాంప్రసాద్ రగతు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X