Naresh Son Naveen: విజయ నిర్మల కృష్ణ వేల కోట్ల ఆస్తి ఎవరి పేరు మీద ఉందో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా దర్శకురాలిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విజయ నిర్మల ఒకరు. ఈమె మహిళా దర్శకురాలిగా ఏకంగా 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి విజయనిర్మల 2019వ సంవత్సరంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె సంపాదించిన వేల కోట్లకు వారసులు ఎవరు అనే విషయం బయటకు వచ్చింది. ఆ వివరాల్లో వెళితే....

విజయ్ నిర్మలకు ఓ బాబు జన్మించిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె మరణించిన మూడు సంవత్సరాలకు కృష్ణ కూడా ఆమె దిగులతోనే చనిపోయారు. ఇక వీరు సంపాదించిన ఆస్తులకు వారసులు ఎవరు అన్న సందేహం అందరిలోనూ కలిగింది. అయితే తాజాగా నరేష్ మొదటి భార్య కుమారుడు నవీన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని విజయనిర్మల ఆస్తులకు వారసులు ఎవరు అనే విషయం గురించి వెల్లడించారు. ఆ ఇంటర్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకొచ్చారు.

Naresh Son Naveen Reacts on Vijaya Nirmala Properties Video goes viral

కేవలం పవిత్రా లోకేష్.. నరేష్ ఆస్తుల కోసమే పెళ్లి చేసుకున్నారని, ప్రేమ ఉండి కాదని కొంత మంది స్టేట్ మెంట్స్ ఇచ్చారు.. దీనిపై మీ సమాధానం ఏంటి అని ఇంటర్వ్యూలో యాంకర్ నవీన్ ను అడిగారు. దీనికి నవీన్ మాట్లాడుతూ... నాకు తెలిసి ఆమె జన్యూన్ పర్సన్. నాతో మాత్రం బాగుంటారు. ఫుడ్ కూడా పంపిస్తారు. వాళ్లిద్దరూ హ్యాపీగా ఉన్నారు. అది చాలు.. మహేశ్ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు.. డాడీ ఏం చిన్నపిల్లాడు కాదు. అడ్వైస్ లు ఇవ్వడానికి. మిస్టేక్స్ అందరి జీవితాల్లో జరుగుతాయని తెలిపారు.

కొన్ని వేల కోట్లు సంపాదించారు విజయ్ నిర్మల గారు... నవీన్ గారికే 50 శాతం రాశారు... మిగతా 50 శాతం నరేష్ గారికి రాశారు అనే దాంట్లో నిజమెంత అని యాంకర్ ప్రశ్న అడగ్గా... దీనిపై నవీన్ తనదైన శైలీలో సమాధానం తెలిపారు. నవీన్ మాట్లాడుతూ... అది రాస్తామని అనుకున్నారు. ప్రస్తుతానికి నరేష్ గారి పేరు మీద మొత్తం ఆస్తి ఉంది. ఆయనే ఆస్తికి వారసుడు. నేను రిటైర్డ్ అయ్యాక నువ్వే కదా చూసుకునేది.. అని చెప్పారు.. ఏదో ఒక ఐడియా పెట్టుకోమని చెప్పారు.

Naresh Son Naveen Reacts on Vijaya Nirmala Properties Video goes viral

నాకు ఈ ఆస్తులను హ్యాండిల్ చేయడం తెలియదు.. వాటిని కాపాడాలంటే కూడా పెద్ద బాధ్యతే. అందుకే ఆస్తులన్నీ నాన్న పేరు మీద ఉంటేనే మంచిదనిపించింది. అందుకే ఆస్తులన్నింటినీ కూడా నాన్న పేరు మీదనే వీలునామా రాశారు. ఇప్పటికి ఆస్తి మొత్తం నాన్న ( నరేష్) పేరు మీదనే ఉంది. ఆయన తర్వాత ఈ ఆస్తిని కాపాడే బాధ్యత నాది అంటూ నవీన్ చెప్పుకొచ్చారు.

Naresh Son Naveen Reacts on Vijaya Nirmala Properties Video goes viral

ఇక ఆస్తుల విషయంలో ఎప్పుడూ మా మధ్య ఎలాంటి గొడవలు రాలేదు. ఇక తన తమ్ముళ్లు రణవీర్, తేజ అంటే నాకు ఎంతో ఇష్టం. రణవీర్ నరేష్ రెండో భార్య కుమారుడు కాగా తేజ రమ్య రఘుపతి కుమారుడు. తనకు తేజ అంటే చాలా ప్రాణమని ఎప్పుడు కూడా నేను వీరితో ఆస్తుల గురించి ఇతర విషయాల గురించి గొడవ పడిన దాఖలాలు లేవు అంటూ తెలిపారు. ఇక నవీన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X