twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శివాజీ రాజా, నేను స్నేహితులమే.. 5 లక్షలు ఇచ్చి కృష్ణగారితో చెప్పొద్దు అంది.. నరేష్!

    |

    మా అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేష్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, రెబల్ స్టార్ కృష్ణం రాజు, కోట శ్రీనివాసరావు, శివాజీ రాజా అతిథులుగా హాజరయ్యారు. మా అసోసియేషన్ ఇతర సభ్యులుగా జీవిత, శివబాలాజీ, రాజీవ్ కనకాల బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తాను మా అసోసియేషన్ కోసం ఏం చేయబోతున్నానో నరేష్ వివరించారు. మా ఎన్నికల ప్రజాస్వామ్యబద్దంగా జరిగిందని అన్నారు.

    ప్రజాస్వామ్యం కాబట్టే

    ప్రజాస్వామ్యం కాబట్టే

    నరేష్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నా జీవితాన్ని చక్రాలుగా నడిపిస్తున్న సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మలగారి దీవెనలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు నరేష్ తెలిపారు. మన మధ్య లేని నా గురువు జంధ్యాల గారిని కూడా తలుచుకుంటూ ప్రసంగాన్ని మొదలు పెడుతున్నాని నరేష్ అన్నారు. అంతా నవాళ్ళే.. వీరితో యుద్ధం చేయాలా అని మహాభారతంలో అర్జునుడు కన్నీరు పెట్టుకుంటాడు. కానీ యుద్ధం చేయడం ధర్మం. అలాగే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించక తప్పదు అని నరేష్ తెలిపారు.

     మంచి మిత్రులం

    మంచి మిత్రులం

    భారత దేశానికీ గొప్ప ఆయుధం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యబద్ధంగా మా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలిచినా, ఓడిన, అవకాశం రాని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని నరేష్ తెలిపారు. మా అసోసియేషన్ 25 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, ఇంకా చాలామంది చొరవతో ఏర్పడింది. ఈ టర్మ్ లో తాను మా అసోసియేషన్ పరువు ప్రతిష్టలపై ఫోకస్ పెడతానని నరేష్ తెలిపారు. ప్రతి సభ్యులు చిరునవ్వుతో ఉండేలా మా అసోసియేషన్ లో జవాబుదారీతనం, పారదర్శకత తీసుకునివస్తాం అని నరేష్ తెలిపారు.

    ఆ డబ్బు ముట్టుకోవద్దు: ‘మా' ప్రమాణ స్వీకారోత్సవంలో శివాజీ రాజా!ఆ డబ్బు ముట్టుకోవద్దు: ‘మా' ప్రమాణ స్వీకారోత్సవంలో శివాజీ రాజా!

    5 లక్షలు ఇచ్చింది

    5 లక్షలు ఇచ్చింది

    మా అసోసియేషన్ సమావేశానికి పిలిచి లక్ష రూపాయలు విరాళంగా ఇమ్మంటే మా అమ్మ 5 లక్షలు ఇచ్చింది. కృష్ణగారితో చెప్పొద్దని తనతో చెప్పినట్లు నరేష్ సరదాగా వ్యాఖ్యానించారు. తమ కుటుంబం ప్రతి నెల మా అసోసియేషన్ కు 15 వేలు ఇస్తున్నాం అని నరేష్ తెలిపారు. మా అసోసియేషన్ కు తన తొలి బహుమతిగా రూ. 1,01,116 ఇస్తున్నట్లు నరేష్ ప్రకటించాడు. ఆ చెక్కుని జనరల్ సెక్రటరీ జీవితకు అందించారు.

     హ్యాట్సాఫ్ తలసానిగారు

    హ్యాట్సాఫ్ తలసానిగారు

    మా అసోసియేషన్ సభ్యత్వ నమోదు ఫీజుని లక్ష నుంచి 90 వేలకు తగ్గించామని ప్రకటించారు. నాగబాబు, చిరంజీవి లాంటి ప్రముఖులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నరేష్ తెలిపారు. మా అసోసియేషన్ చేయబోయే మరికొన్ని కార్యక్రమాలు వివరించారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసానికి హ్యాట్సాఫ్ అంటూ నరేష్ ప్రశంసలు కురిపించారు. ఎవరైనా మా సభ్యుడికి ఆరోగ్యం కోసం అత్యవసరంగా డబ్బు అవసరమైతే రూ 5 లక్షల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పిస్తా అని మాట ఇచ్చినట్లు నరేష్ తెలిపారు.

    English summary
    Naresh Speech at MAA Swearing-in Ceremony event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X