బాటా చెప్పుతో చెంపమీద కొట్టారు..అల్లరి నరేష్
ఒకసారి ఆయన బాటా చెప్పుతో నరేష్‌ని చెంపమీద కొట్టారు. ఆ ముద్ర నాలుగు రోజుల దాకా ఉంది. దాంతో పిల్లలు అల్లరి చేసినంత మాత్రాన కొట్టేస్తామా..నిదానంగా చెబితే వింటాడు కదా..అంటూ ఆయనతో వాదించా అంటూ అల్లరి నరేష్ తల్లి సరస్వతి తన కుమారుడు చిన్నప్పటి రోజులును గుర్తు చేసుకుంటూ ఓ న్యూస్ పేపరులో ముచ్చటించారు. సండే స్పెషల్ గా సాగిన ఆ ఇంటర్వూలో అల్లరి నరేష్, తల్లి సమాధానాలు ఇచ్చారు. తన తండ్రి అలా బాటా చెప్పుతో కొట్టడానికి కారణం ఉందంటూ..అప్పట్లో మాకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. సెలవుల్లో తెలుగు నేర్పాలని నాన్నగారు పెద్ద బాలశిక్ష తెచ్చి రోజూ హోంవర్క్ ఇచ్చేవారు. అన్నయ్య గబాగబా పూర్తి చేసేవాడు. నేనేమో వాయిదా. ఒకరోజు నాన్న హోంవర్క్ గురించి అడిగి రాయలేదనడంతో కోప్పడ్డారు. అప్పుడే బాటా ముద్ర పడింది. చెప్పు సైజు చెంపపై అచ్చు పడింది. అది వారం దాకా ఉంది. నేనేం తక్కువ తిన్నానా! స్కూలుకెళ్లాక అన్న కొట్టాడని చెప్పా. టీచరు అన్నయ్యను కొట్టడం, తను ఇంటికొచ్చి చెప్పాక, మళ్లీ నాకు దెబ్బలు. అదలా సాగిందనుకోండి అంటూ తండ్రి ఇవివి సత్యనారాయణ ఎంత జాగ్రత్తగా క్రమ శిక్షణతో వాళ్లని పెంచారో, ప్రేమను పంచారో చెప్తూ మనస్సు విప్పాడు.


Click it and Unblock the Notifications











