తొందరపడ్డ...తమన్నాకు షాకే మిగిలింది

By Staff

Tamanna
తాజాగా తమన్నా " పద్మశ్రీ ఏడుకొండలు" అనే కొత్త చిత్రాన్ని ఒప్పుకుంది. గతంలో శ్రీకాంత్ హీరోగా కాంచన మాల కేబుల్ టీవీ అనే ఫ్లాఫ్ చిత్రాన్ని డైరక్ట్ చేసిన విజయ సారధి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇక హీరో అల్లరి నరేష్. అలాగే క్రిందటి వారం రిలీజై ఫ్లాప్ టాక్ నిన్న నేడు రేపు చిత్రం లోనూ ఆమే హీరోయిన్. అందులో ఆమె పాత్ర చాలా సబ్ స్టాండర్డ్స్ లో ఉంటుంది.అలాగే అంతకు ముందు రిలీజైన పెద్ద ఫ్లాపు చిత్రం కాళిదాసు లోనూ ఆమే హీరోయిన్. ఇలా తమన్నా హ్యాపీడేస్ తో తానేమిటో ప్రూవ్ చేసుకున్నా అన్నీ విచిత్రమైన సినిమాల్లో చేస్తోంది. తర్వాత వస్తున్న రిజల్ట్స్ ని షాకయి చూస్తోంది.

అసలు హ్యాఫీ డేస్ లాంటి హిట్ తర్వాత అంతా ఆమె ఇక పెద్ద పెద్ద సినిమాలతో వెలిగిపోతుందనుకున్నారు. అలాగే తమన్నా కూడా మహేష్ బాబు లాంటి స్టార్ సినిమాలో అవకాశమొచ్చినా పాత్ర సరిగా లేదని వద్దనటంతో గ్యారింటీగా మంచి స్టెప్పే తీసుకుందనుకున్నారు. అయితే ఇప్పుడు అంతా రివర్స్ లో జరుగుతోంది. ఆమె చేస్తున్న సినిమాలు లిష్టు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇలా జరగటానికి కారణం ఆమె తొందరపాటే అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. దశరధ్ దర్శకత్వంలో వచ్చిన శ్రీ సినిమా ఫ్లాపు కావటంతో పెధ్ద ఆఫర్స్ ఇక రావని ఆమె డిసైడ్ అయ్యింది.

అందులోనూ ఆమె చుట్టుప్రక్కల వాళ్ళు కెరీర్ ఇక ముగిసిపోయినట్లే అందులోనూ నీకు గాడ్ ఫాదర్స్ కూడా లేరు అని భయపెట్టారు. దాంతో ఆ గ్యాప్ లో ఆమె వరసలో వచ్చిన చిత్రాలన్నీ కథ వినకుండా,హీరో,దర్శకుడు చూసుకోకుండా,నిర్మాత ఇచ్చిన కొద్దిపాటి అడ్వాన్స్ తీసుకుని కమిటయి ఒప్పుకుందనీ ఆ ఇంపాక్టు ఇప్పుడు చూపెడుతోందని అంటున్నారు. కాబట్టి తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఇట్లాంటి ఫలితాలనే ఇస్తాయినీ,ఇప్పటికైనా సినిమా ఒప్పుకునే ముందు బ్యానర్ ,హీరో,దర్శకుడు వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సీనియర్స్ హెచ్చరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X