Don't Miss!
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాస్యరసం పాదర సంలాంటిది కామెడీ 'పులిహోర'
నరేష్ తెలుగు ప్రేక్షకుల హృదయ లోగిళ్లలో హాస్యపు జల్లుల్ని కురిపించిన విలక్షణ నటుడు నరేష్. 150 పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్ని పోషించారాయన. తాజాగా నరేష్ 'మా టివీలో ప్రసారం కానున్న ధారా వాహిక 'పులిహోరలో ప్రధాన పాత్రని పోషిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'తెలుగు ప్రజలందరికీ ఎంతో ప్రీతిపాత్రమైన వంటకం 'పులి హోర. టైటిల్లోనే మంచి హాస్యం వుంది. భిన్న మనస్తత్వాలు కలిసిన వ్యక్తులు ఓ కుటుంబంలా ఒకే చోటకు చేరితే ఎలా వుంటుంది, వారి మధ్య గిలిగింతలు పెట్టే చక్కటి హాస్యపండించే సంఘ టనలు చోటుచేసుకుంటాయి అనేది ఈ పులిహోర ప్రధాన ఇతివృత్తం.
ఇందులో నేను వివిధ గెటప్‌లలో భిన్న పాత్రల్ని పోషిస్తున్నాను. తెలుగు టీవీ చరిత్రలో 'పులిహోర చరిత్ర సృష్టిస్తుంది. క్లాస్, మాస్,యూత్ అనే తేడా లేకుండా అన్ని వర్గాలను అలరిస్తుంది. హాస్యరసం పాదర సంలాంటిదని స్వర్గీయ జంధ్యాల అనేవారు. నవ్వించడం చాలా కష్టం. కానీ 'పులిహోర అందరనీ నవ్వించే నిండు భోజనంలా వుంటుంది. కొంచెం రొమాంటిక్ టచ్ కూడా వుంటుంది అన్నారు.