బాలీవుడ్ నెక్ట్స్ బికినీ బేబ్ ఆ హాట్ లేడీనే...
ముంబై: రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన 'రాక్ స్టార్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్ బ్యూటీ నర్గీస్ ఫక్రి.....తన తర్వాతి సినిమాలో స్విమ్ సూట్ బికినీతో అభిమానులకు కనువిందు చేయబోతోంది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మే తేరా హీరో' చిత్రంలో ఆమె టూ పీస్ బికినీలో కనిపించనుంది.
ఈ చిత్రంలో నర్గీస్ ఫక్రితో పాటు వరుణ్ ధావన్, ఇలియానా లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. బికినీ వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో....ఫిల్మ్ సర్కిల్‌లో ఇపుడు అందరూ ఆమెను బాలీవుడ్ నెక్ట్స్ బికినీ బేబ్ అంటూ పిలుస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ బికినీ బేబ్ అధితి రావు హైదరి. తాజాగా విడుదలైన 'బాస్' చిత్రంలో ఆమె బికినీలో అందాలు ఆరబోసింది.
నర్గీస్ ఫక్రి ఇప్పటికే పలు ఫోటో షూట్లలో టూ పీస్ బికినీల్లో దర్శనం ఇచ్చింది. అయితే హిందీ సినిమాల్లో మాత్రం బికినీ వేయడం ఇదే తొలిసారి. ఫోటో షూట్లలో ఆమె బకినీ కామనే కాబట్టి...మరింత స్పెషల్‌గా ఆమె అందాలను ప్రత్యేకంగా ఎక్స్ ఫోజ్ చేసే విధంగా బికినీ డిజైన్ చేయిస్తున్నారట.
ఆమె స్విమ్ సూట్‌ను ఫ్యాషన్ స్టైలిస్ట్ శ్యామలీ సింగ్ డిజైన్ చేస్తున్నారు. సినిమాలోని ఓ సాంగు సీక్వెన్స్‌లో నర్గీస్ బికినీలో కనిపించబోతోంది. ఇటీవలే ఇందుకు సంబంధించిన సాంగును థాయ్ లాండ్‌లో చిత్రీకరించినట్లు బాలీవుడ్ నుంచి వినిపిస్తున్న తాజా సమాచారం.


Click it and Unblock the Notifications












