హీరోయిన్‌పై క్రికెటర్ ధోనీ, జాన్ అబ్రహం బాక్సింగ్ పంచ్!
హైదరాబాద్: ఓ వైపు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం, మరో వైపు టీమిండియా కోప్టెన్ ధోని....తమ బాక్సింగ్ పంచ్‌లతో ఆ హీరోయిన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రి. ఓ స్పోర్ట్స్ కమర్షియల్ యాడ్ చిత్రీకరణలో భాగంగా నర్గీస్ ఫక్రిపై కలిసి జాన్ అబ్రహం, ధోనీ బాక్సింగ్ పంచ్‌లు విసిరారు. ఇందుకు సంబంధించిన ఫోటోను నర్గీస్ ఫక్రి తన మైక్రో బ్లాగింగ్ సైట్లో అప్ లోడ్ చేసింది.
గతంలో నర్గీస్ ఫక్రి, జాన్ అబ్రహం కలిసి 'మద్రాస్ కేఫ్' అనే చిత్రంలో కలిసి నటించారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో కూడా ఇద్దరూ ఎంతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. వీరిద్దరి పక్కనే బాక్సింగ్ ఫోజులో ఉన్నాడు క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని.

నర్గీస్ ఫక్రి విషయానికొస్తే...ఆమె తాజాగా నటించిన 'మే తెరా హీరో' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది. నర్గీస్ ఫక్రి, పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్ మోడల్. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన 'రాక్ స్టార్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన సెక్సీ అందచందాలతో భారతీయ ప్రేక్షకులను కవ్విస్తూనే ఉంది.
33ఏళ్ల ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్ పైనే తన పూర్తి ఫోకస్ పెట్టింది. రాక్ స్టార్ తర్వాత నర్గీస్ హీరోయిన్‌గా నటించిన 'మద్రాస్ కేఫ్' సినిమా విడుదలైనా ఆమెకు పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత పతా పోస్టర్ నిక్లా హీరో అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది. 2014లో ఆమె నటించిన మే తెరా హీరో చిత్రం విడుదలైన బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఇక ఆమె నటించిన మరో చిత్రం షౌకీన్ విడుదల కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











