‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’గా ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ బావమరిది .. అదిరిపోయిన ఫస్ట్ లుక్

తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమలో వారసుల ఆగమనం అనేది చాలా సర్వసాధారణం అయిపోయాయి. నటుల కుమారులు నటులే అవ్వాలని లేదా నటీమణుల కుమార్తెలు నటీమణులే అవ్వాలని ఎక్కడా గిరి గీసుకుని కూర్చో కుండా సినీ పరిశ్రమలో ఉన్న 24 విభాగాలలో ఏదో ఒకదానిలో సత్తా చాటేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరోలకు సంబంధించిన వారసులు ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకున్నారు. ఇప్పుడు అదే కోవలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది కూడా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

లక్ష్మీ ప్రణతిని

లక్ష్మీ ప్రణతిని


టాలీవుడ్లో మరో కొత్త కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నాడు. అయితే అతనికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఒకప్పుడు స్టూడియో ఎన్ అధినేత అయిన నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నే నితిన్ ఇప్పుడు హీరో గా మారారు. ఆయన సోదరి లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకోవడం గమనార్హం

 వేగేశ్న సతీష్ దర్శకత్వం

వేగేశ్న సతీష్ దర్శకత్వం


ఆయన హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు 'శ్రీ శ్రీ శ్రీ రాజా వారు' టైటిల్ ఖరారు చేశారు. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై రామారావు చింతపల్లి మరియు MS రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 2017లో "శతమానం భవతి" సినిమా తీసి నేషనల్ అవార్డు గెలుచుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించారు.

ఫస్ట్ లుక్ విడుదల

ఫస్ట్ లుక్ విడుదల


ఇక ఈ సినిమాలో హీరోగా లాంచ్ అవుతున్న నితిన్ నటనలో పూర్తి శిక్షణ తీసుకున్న తర్వాత "శ్రీశ్రీశ్రీ రాజా వారు" వంటి విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ సినిమాను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని సినిమా యూనిట్ ప్రకటించింది. 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక తాజాగా హీరో నార్నే నితిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

 గ్రాండ్ గా రిలీజ్

గ్రాండ్ గా రిలీజ్


ఆలయ ఉత్సవాల నేపథ్యంలో సృజనాత్మకంగా రూపొందించిన పోస్టర్ లో సైడ్ పోజ్‌లో నార్నే నితిన్, రెడ్ చెక్స్ ఫుల్ హ్యాండ్ షర్ట్, జీన్స్ ప్యాంట్ మరియు స్పోర్ట్స్ షూస్‌తో రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. జాతరలో స్టైల్‌గా సిగరెట్ వెలిగిస్తున్న నార్నే నితిన్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అక్షరాలను సిగరెట్‌లా డిజైన్ చేయడంతో సినిమా లోగో సినిమా మీద క్యూరియాసిటీని మరింత పెంచింది.ఇక నిర్మాతలు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

 త్వరలో

త్వరలో


త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు తెలియజేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో నార్నే నితిన్ చంద్ర, నరేష్ V.K, రావు రమేష్, ప్రవీణ్, సుదర్శన్, భద్రం, అనంత ప్రభు, ప్రియా మాచిరాజు, నిహారిక సతీష్, మీనా కుమారి, రచ్చ రవి తదితరులు నటించారు. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొడతానని హీరో నితిన్ నమ్ముతున్నాడు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X