»   » ఉగ్రదాడి: కొద్దిలో తప్పించుకున్న రేణుదేశాయ్

ఉగ్రదాడి: కొద్దిలో తప్పించుకున్న రేణుదేశాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: పారిస్ ఉగ్రదాడి నుంచి ప్రముఖ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తృటిలో తప్పించుకున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే గత కొన్ని రోజుల వరకు రేణుదేశాయ్ పర్యటించారు. పారిస్ ట్రిప్ ముగించుకొని శనివారం ఉదయం ముంబైలో దిగారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.

'ఇప్పుడే ప్యారిస్ నుంచి ముంబైలో ల్యాండ్ అయ్యాను. దిగగానే పారిస్ పై ఉగ్రదాడి విషయం తెలిసింది. నా క్షేమం కోసం మెసేజ్ లు చేసిన వారికి కృతజ్జతలు' అంటూ రేణుదేశాయి ట్విట్ చేశారు.


పెళ్లి చేసుకోకుండానే ఎంతో సంతోషంగా సహ జీవనం సాగిస్తున్న పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు.
Narrow Escape for Renu Desai in Paris Attacks

రేణు దేశాయ్ నిర్మాతగా మారి ‘మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ మధ్యన ఈచిత్రం విడుదలైంది. సమీర్ జోషి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈచిత్రంలో స్వప్నిల్ జోషి, ముక్తా బార్వే, సాయి తమ్హాంకర్ ముఖ్య పాత్రలు పోషించారు.

English summary
"I just landed in Mumbai. Heard about the Paris attack right now! I am safe. A heartfelt thank you for the msgs of concern for my safety!", posted Renu Desai, on her twitter page, as the fans of the former actress and Pawan Kalyan's ex-wife were severely upset.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu