twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటుడు నర్సింగ్ యాదవ్ పరిస్థితి విషమం.. రూమర్లను ఖండించిన సతీమణి

    |

    కమెడియన్, విలన్, నర్సింగ్‌యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆకస్మాత్తుగా ఆయన కోమాలోకి వెళ్లడంతో కుటుంబం సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే నర్సింగ్ యాదవ్ పరిస్థితి విషమంగా ఉందనే విషయం వైద్యులు వెల్లడిస్తున్నట్టు సమాచారం. పలు చిత్రాల్లో తనదైన డైలాగ్ డెలివరీతో, కామెడీ విలనిజంతో ఆకట్టుకొన్న నర్సింగ్ యాదవ్‌పై అనారోగ్యం వెనుక వస్తున్న రూమర్లను ఖండిస్తూ ఆయన భార్య చిత్ర యాదవ్ మీడియాలో ఓ ప్రకటన చేశారు. అదేమిటంటే..

     భార్య చిత్ర యాదవ్ స్పందన

    భార్య చిత్ర యాదవ్ స్పందన

    నర్సింగ్ యాదవ్ ఆరోగ్యంపై స్పందిస్తూ.. నా భర్త నర్సింగ్ యాదవ్ కొంతకాలంగా మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్సలో భాగంగా గురువారం డయాలిసిస్ చేయించాం. అనుకోకుండా సాయంత్రం 4 గంటలకు కోమాలోకి వెళ్లాడు. దాంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతున్నది అని చిత్ర యాదవ్ మీడియాకు వెల్లడించారు.

    సోషల్ మీడియాలో వార్తలు అవాస్తవం

    సోషల్ మీడియాలో వార్తలు అవాస్తవం

    నర్సింగ్ యాదవ్ అనారోగ్యం వెనుక అనేక అవాస్తవాలు మీడియాలో కనిపిస్తున్నాయి. ఆయన పరిస్థితి విషమించడానకి వెనుక కారణం అనారోగ్యమే. దీర్ఘకాలంగా బాధపడుతున్న వ్యాధులే కారణం. అంతకుమించి ఎలాంటి సంఘటనలు జరుగలేదు. వాస్తవాలు తెలుసుకొని ఆయన గురించి రాయండి. నర్సింగ్ యాదవ్ ఆరోగ్యం గురించి ఏదైనా కావాలంటే మమల్ని సంప్రదించండి. లేదా ఆయన తోటి నటీనటులు అడిగి రాయండి అని చిత్ర యాదవ్ కోరారు.

    రూమర్లను నమ్మకండి

    రూమర్లను నమ్మకండి

    నర్సింగ్ యాదవ్ ఇంట్లో కింద పడిపోయాడు, తలకి గాయమైందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. తాను ఎక్కడ కింద పడిపోలేదు. అనారోగ్యం కారణంగా ఉన్నట్లు ఉండి కోమాలోకి వెళ్ళిపోయాడు. త్వరగా కోలుకుని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాం. సోషియల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎవరు నమ్మకండి. నర్సింగ్ యాదవ్ క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోవాలి అని చిత్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

    నర్సింగ్ యాదవ్ కెరీర్ గురించి

    నర్సింగ్ యాదవ్ కెరీర్ గురించి

    రాంగోపాల్ వర్మ రూపొందించిన పలు చిత్రాల్లోనే కాకుండా ఇతర చిత్రాల్లో కూడా నర్సింగ్ యాదవ్ తనదైన నటనను ప్రదర్శించారు. ఆయన డైలాగ్ డెలీవరికి ఓ ప్రత్యేకత ఉంటుందనేది తెలుగు ప్రేక్షకుల అభిప్రాయం. అనారోగ్య కారణాల వల్ల ఆయన కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆరోగ్య పరిస్థితి క్షీణించి కోమాలోకి వెళ్లడం సినీ పరిశ్రమలోని తన సన్నిహితులను, ప్రేక్షకులను ఆవేదనకు గురిచేస్తున్నది.

    Recommended Video

    Writer Sai Madhav Burra About Gollapudi Maruthi Rao || Filmibeat Telugu
    నర్సింగ్ యాదవ్ పలు భాషల్లో

    నర్సింగ్ యాదవ్ పలు భాషల్లో

    స్వర్గీయ విజయనిర్మల దర్శకత్వం వహించిన హేమాహేమీలు చిత్రం ద్వారా చిత్ర సీమలోకి ప్రవేశించిన నర్సింగ్ యాదవ్.. అనతి కాలంలోనే మంచి పేరును సంపాదించుకొన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు వంద చిత్రాల్లో నటించారు. రాంగోపాల్ వర్మ రూపొందించిన క్షణక్షణం, మనీ, మనీ మనీ లాంటి చిత్రాల్లో మంచి ప్రేక్షకాదరణను సంపాదించుకొన్నారు. చిరంజీవి నటించిన టాగోర్, మహేష్ బాబు పోకిరి చిత్రాలు ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి.

    English summary
    Actor Narsing Yadav health condition serious as per Doctors report. His wife Chitra Yadav squashes rumours on his health condition. She said that He went into coma and giving treatment on vetilator.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X