twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నర్సింగ్ యాదవ్ కొడుకు కోసం మెగాస్టార్ ఖరీదైన గిఫ్ట్.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా

    |

    విలన్ గా సపోర్టింగ్ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నర్సింగ్ యాదవ్ గత ఏడాది డిసెంబర్ 31న ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే నర్సింగ్ యాదవ్ మరణంతో అందరికంటే ఎక్కువగా బాధపడిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. మెగాస్టార్, నర్సింగ్ కు ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికి తెలిసిందే. ఇక ఇటీవల నర్సింగ్ యాదవ్ సతీమణి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ తో ఆయనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు.

    విలన్ గానే కాకుండా..

    విలన్ గానే కాకుండా..

    నర్సింగ్ యాదవ్ అంటే ఇండస్ట్రీలో అందరికి సన్నిహితులే. పైకి గంబీరంగా కనిపించినప్పటికి వయసు తగ్గట్లుగానే ఎదుటి మనిషికి గౌరవం ఇస్తారని చెబుతూంటారు. ఎలాంటి సినిమా పాత్రలో నటించినా కూడా తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసేవారు. కేవలం విలన్ గానే కాకుండా కామెడీ యాంగిల్ లో కూడా మెప్పించేవారు.

    నర్సింగ్ యాదవ్ తో మెగాస్టార్ అనుబంధం

    నర్సింగ్ యాదవ్ తో మెగాస్టార్ అనుబంధం

    మెగాస్టార్ చిరంజీవితో నర్సింగ్ యాదవ్ కు మంచి అనుబంధం ఉంది. నర్సింగ్ చనిపోయినప్పుడు కూడా ఆయన ఎంతగానో ఎమోషనల్ అయ్యారు. మంచి ఆప్త బందువును కోల్పోయనని అన్నారు. నిజానికి ఒకప్పుడు నర్సింగ్ యాదవ్ లేనిదే మెగాస్టార్ బయటకు వెళ్ళేవారు కాదు.

    తోడుగా నర్సింగ్ యాదవ్ ఉండాల్సిందే

    తోడుగా నర్సింగ్ యాదవ్ ఉండాల్సిందే

    షూటింగ్ కోసమైనా లేదా ఎక్కడికైనా ఈవెంట్స్ కు వెళ్లినా సరే తోడుగా నర్సింగ్ యాదవ్ ఉండాల్సిందే. ఇక మెగాస్టార్ షూటింగ్ కు వెళ్ళడానికి ముందే స్పాట్ కు వెళ్లి పరిస్థితులను చక్కబెట్టేవారు. చిరంజీవికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేవారు.

    అలా గ్యాప్ వచ్చింది

    అలా గ్యాప్ వచ్చింది

    మెగాస్టార్ కు నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన నర్సింగ్ యాదవ్ కొన్నాళ్లకు ఆరోగ్య పరిస్థితుల వల్ల గ్యాప్ ఏర్పడింది. ఇక అపుడే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో బిజీగా అయిపోవడంతో మరింత గ్యాప్ ఏర్పడింది. అయినప్పటికీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నర్సింగ్ యాదవ్ చిరంజీవిని పర్సనల్ గా కలిసేవారు.

    స్పందించిన నర్సింగ్ యాదవ్ భార్య

    స్పందించిన నర్సింగ్ యాదవ్ భార్య

    ఇక ఇటీవల భార్య చిత్ర ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ తో ఉన్న అనుబంధం గురించి మరోసారి వివరణ ఇచ్చారు. మెగాస్టార్ ఎక్కడికెళ్లినా కూడా నర్సింగ్ యాదవ్ ను వెంటపెట్టుకొని వెళ్ళేవారని ఆయన ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందని మెగాస్టార్ అనేవారని చిత్ర తెలిపారు.

    Recommended Video

    Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
     కొడుకు పుట్టిన సంతోషంలో

    కొడుకు పుట్టిన సంతోషంలో

    అయితే ఒకరోజు తమకు కొడుకు పుట్టినప్పుడు ఆయన దగ్గరకు తీసుకువెల్లగా ఎంతగానో సంతోషం వ్యక్తం చేసినట్లు చిత్ర వివరణ ఇచ్చారు. నర్సింగ్ యాదవ్ కు కొడుకు పుట్టాడు అనే ఆనందంతో వెంటనే మ్యానేజర్ ని పిలిచి ఖరీదైన గోల్డ్ చేయిన్ తెప్పించారు. దాదాపు 7తులాల విలువగల ఆ గోల్డ్ చేయిన్ ను అలాగే బాబు మెడలో వేసినట్లు చిత్ర తెలిపారు. అలాగే నేను తరచుగా ప్రతి రాఖీ పండగకు మెగాస్టార్ కు రాఖీ కూడా కట్టేదాన్ని అని ఆమె తెలిపారు.

    English summary
    Narsing Yadav, who has made a name for himself as a senior character artist, has recently lost his life. Many movie stars will die in 2020. Nursing Yadav also closed his eyes at the end of the year, which shocked everyone. And how he died has created some confusion for many. Narsing Yadav's wife gave a film description on the subject. He also informed about his association with cricketers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X