ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొట్టిన నాగ శౌర్య ‘నర్తనశాల’
నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన 'నర్తనశాల' సినిమాకు విడుదల ముందే మంచి రెస్పాన్స్ వస్తోంది. శౌర్య నటించిన గత చిత్రం 'ఛలో' బిజినెస్ రికార్డులను ఈ మూవీ తుడిచిపెట్టేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన 'ఛలో' మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో 'నర్తనశాల' మూవీ థియేట్రికల్ రైట్స్ మంచి ధరపలికింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'నర్తనశాల' గ్లోబల్ థియేట్రికల్ రైట్స్ రూ. 9.80 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. నటుడిగా నాగ శౌర్యకు మంచి పేరు ఉండటం, గత చిత్రం భారీ విజయం అందుకోవడంతో థియేట్రికల్ రైట్స్ డిమాండ్ పెరిగింది.
శౌర్య నటించిన గత చిత్రం 'ఛలో' థియేట్రికల్ రైట్స్ రూ. 6 కోట్లకు అమ్ముడయ్యాయి. ఫుల్ రన్‌లో రూ. 24 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టింది. రూ. 12.30 కోట్ల షేర్ వసూలు చేయడం ద్వారా డిస్ట్రిబ్యూటర్లకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది.

ఈ నేపథ్యంలో 'నర్తనశాల' సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వం వహించారు. నాగ శౌర్య సొంతబేనర్ 'ఇరా క్రియేషన్స్' పతాకంపై ఆయన తల్లి ఉషా మల్లూరి ఈ మూవీ నిర్మించారు.
శౌర్య సరసన కాశ్మీరా హీరోయిన్‌గా నటించింది. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగ శౌర్య గత చిత్రాలను మించిపోయేలా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. యూఎస్ఏలో 144పైగా స్క్రీన్లలో ఈ చిత్రం విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











