షెర్లిన్ చోప్రా కామసూత్రలో... నాజర్ (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: నటుడు నాజర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు సౌతిండియాలోని అన్ని సినీపరిశ్రమల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. నెగెటివ్ పాత్రైనా, పాజిటివ్ పాత్రైన తనదైన రీతిలో రక్తికట్టించే బహుముఖ నటుడు అయిన నాజర్..... బాలీవుడ్లో షెర్లిన్ చోప్రా ప్రధాన పాత్రలో రూపొందుతున్న సెక్స్ చిత్రం 'కామసూత్ర 3డి'లో నటించబోతున్నాడు.
ఈ చిత్రంలో నాజర్ పాత్ర విషయానికొస్తే... రాజ్ పుత్ వంశానికి చెందిన రాజు పాత్రలో కనిపించబోతున్నాడు. అతని సామ్రాజ్యంపై మొఘలులు దాడి చేసి వశ పరుచుకుంటారు. ఆ తర్వాత అతను మానసికంగా సఫర్ అయిన అధికారం లేని జీవితం గడుపుతాడు. ఇందులో నాజర్ కూతురుగా షెర్లిన్ చోప్రా కనిపించనుంది.
నాజర్ ఈ చిత్రంలో నటించడంపై షెర్లిన్ చోప్రా ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. 'నాజర్ లాంటి గొప్ప యాక్టర్ కామసూత్ర సినిమాలో చేయడం ఎంతో ఆనందంగా ఉంది' అని ట్వీట్ చేసింది. ఈ పాత్రకు నాజర్ పర్ పెక్ట్ గా సూటవుతాడని, అందుకే ఆయన్ను పాత్ర చేయడానికి ఒప్పించినట్లు దర్శకుడు రూపేష్ పాల్ వెల్లడించారు. అదే విధంగా ప్రముఖ మళయాల నటుడు సలీమ్ కుమార్ కూడా ఈచిత్రంలో ఓ పాత్ర చేస్తున్నారు.

కామసూత్ర 3డి అనేది ఒక భారతీయ యువరాణి కథ.

వాత్సాయన కామసూత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో షెర్లిన్ తన అందాలను నగ్నంగా ఆరబోసింది.

ఈ చిత్రానికి రూపేష్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఒక రియల్ చారిత్రక నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











