మహేష్ బాబు తండ్రి ఎవరో తెలిసిపోయింది!
'పోకిరి' చిత్రంలో మహేష్ బాబు తండ్రిగా నటించిన నాజర్ మరోసారి ఆయన తండ్రిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ప్రకాష్ రాజ్ తప్పుకోవటంతో ఆ ప్లేస్ లోకి అనుపమ్ ఖేర్‌ను తీసుకోవాలని తొలుత భావించినా...చివరకు నాజర్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
సినిమా గురించి గతంలో దిల్ రాజు మాట్లాడుతూ ''25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్ ఇది. వెంకీ, మహేష్ అన్నదమ్ము లుగా నటిస్తున్నారు. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు..అంటే కుటుంబం. టైటిల్ మంచి ఫీల్‌నిచ్చింది''అన్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రూపొందుతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు. మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. దిల్ రాజు నిర్మాత.
ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా రూపొందబోతోంది. ఈ చిత్రం స్క్రిప్టుని రీసెంట్ గా సుకుమార్ గోవాలో పూర్తి చేసుకుని వచ్చారు. మహేష్ చేత ఓకే చేయించుకుని ఆయన ప్రస్తుతం నటీనటులును ఎంపిక చేస్తూ బిజీగా ఉన్నారు. మరో ప్రక్క సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజికల్ సిట్టింగ్స్ జరుపుతున్నారు.


Click it and Unblock the Notifications











