నటరాజ్ మాస్టర్‌కు బాలయ్య బంపర్ ఆఫర్: బిగ్ బాస్ గెలవకున్నా ఇలా సక్సెస్ అయ్యాడుగా!

బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షో ఇది. అంతలా ఐదేళ్లుగా ఇది టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అంతేకాదు, మన దగ్గరే ఎక్కువగా ఆదరణను అందుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. దీంతో ఈ కార్యక్రమానికి అభిమానులు కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. ఇక, ఈ షోలోకి కంటెస్టెంట్లుగా వచ్చిన వాళ్లంతా బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇలా ఇటీవలే ఐదో సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్ ఏకంగా బాలయ్య నుంచి బంపర్ ఆఫర్ పట్టేశాడు. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైన ప్రయాణం.. మంచి పేరు

అలా మొదలైన ప్రయాణం.. మంచి పేరు

నటుడిగా సత్తా చాటాలని హైదరాబాద్‌లో అడుగు పెట్టాడు నటరాజ్ మాస్టర్. ఇలా చాలా కాలం అవకాశాల కోసం వేచి చూసిన తర్వాత.. అతడు డ్యాన్సర్‌గా మారాడు. అప్పటి నుంచి పలు కార్యక్రమాల్లో తనదైన శైలి డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు. అనంతరం మాస్టర్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా ఛాన్స్‌లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు.

19 మందిలో ఒకడిగా.. ఎమోషనల్ ఎంట్రీ

19 మందిలో ఒకడిగా.. ఎమోషనల్ ఎంట్రీ

గత నెలలో బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అందులో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో నటరాజ్ మాస్టర్ కూడా ఒకడు. డ్యాన్స్ మాస్టర్‌గా పేరొందినప్పటికీ సినిమా ఛాన్స్‌లు అందుకోలేకపోయిన ఆయనకు.. ఈ షోలో ఆఫర్ వచ్చింది. దీంతో ఏడు నెలల గర్భిణిగా ఉన్న భార్యను వదిలి షోలోకి అడుగు పెట్టేశాడు.

ఆటలో టాప్‌గా.. ఎప్పుడూ గొడవల్లో భాగం

ఆటలో టాప్‌గా.. ఎప్పుడూ గొడవల్లో భాగం

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే నటరాజ్ మాస్టర్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ప్రతి టాస్కులోనూ వందకు వంద శాతం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఇలా ఆటలో తన సత్తాను నిరూపించుకుని కొన్నింటిలో గెలుపొందాడు. అయితే, తరచూ ఏదో ఒక గొడవలో భాగం అవడంతో విమర్శలను ఎదుర్కొని ఇబ్బందులు పడ్డాడు.

ఊహించని విధంగా ఎలిమినేట్ అవుతూ

ఊహించని విధంగా ఎలిమినేట్ అవుతూ

ఎన్నో అంచనాలు, ఆశలతో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన నటరాజ్ మాస్టర్.. చక్కగా ఆడినప్పటికీ పలు గొడవల్లో భాగం అవడంతో నామినేషన్స్‌లోకి వస్తుండేవాడు. ఆరంభంలో ప్రేక్షకుల మద్దతుతో తప్పించుకున్నా.. ఆ తర్వాత మాత్రం షో నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో నాలుగు వారాల తర్వాత ఎంతో ఎమోషనల్ అయిపోతూ హౌస్ నుంచి బయటకు వచ్చాడు.

బయటకు వచ్చిన వెంటనే బంపర్ ఛాన్స్

బయటకు వచ్చిన వెంటనే బంపర్ ఛాన్స్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంతో కాన్ఫిడెంట్‌గా వెళ్లిన నటరాజ్ మాస్టర్.. నాలుగు వారాలకే ఇంటికి చేరుకున్నాడు. అయితే, గతంలో కంటే ఈ షో ద్వారా అతడు మరింత పాపులర్ అయ్యాడు. దీంతో ఆయనకు పలు ఆఫర్లు వస్తున్నాయని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇప్పటికే కొన్ని ఛాన్స్‌లు కూడా అందుకున్నాడట. అందులో ఓ బంపర్ ఆఫర్ కూడా ఉంది.

ఏకంగా బాలయ్యతోనే డ్యాన్స్ చేయించి

ఏకంగా బాలయ్యతోనే డ్యాన్స్ చేయించి

బిగ్ బాస్ షో పుణ్యమా అని గతంలో కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్న నటరాజ్ మాస్టర్‌కు తాజాగా ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది ఎవరితోనే కాదు.. టాలీవుడ్‌లో టాప్ హీరోగా వెలుగొందుతోన్న నటసింహా నందమూరి బాలకృష్ణది అని తెలిసింది. అయితే, ఇది సినిమా ఛాన్స్ మాత్రం కాదట. బాలయ్య చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' టాక్ షోది.

Recommended Video

Natyam Movie Review By Nandamuri Balakrishna
ఇదే బిగ్ బాస్ విజయం అన్నట్లుగా పోస్ట్

ఇదే బిగ్ బాస్ విజయం అన్నట్లుగా పోస్ట్

నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వీడియో కోసం 'Unstoppable with NBK' అనే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో కోసం బాలయ్య కొంత డ్యాన్స్ వేయబోతున్నారట. దీనికే నటరాజ్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నారు. తాజాగా వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటో బయటకు రావడంతో ఈ విషయం వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X