నాగార్జున ‘భాయ్’లో వర్మ ఫ్యాక్టరీ సెక్స్ బాంబ్
హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ నుంచి భారతీయ సినీ తెరకు పరిచయమైన భామ నథాలియా కౌర్. బ్రెజిల్‌లో పుట్టిన ఈ చిన్నది డిపార్ట్‌మెంటు చిత్రంలోని ఐటం సాంగులో ఏ రేంజ్‌లో అందాలు ఆరబోసిందో తెలిసిందే. బికినీకి ఏమాత్రం తీసి పోని డ్రెస్సుతో విచ్చల విడిగా అందాలు చూపించి ఒక్కసారి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.
తాజాగా నథాలియా తెలుగు తెరపై తళుక్కుమనబోతోంది. కింగ్ నాగార్జున నటిస్తున్న 'భాయ్' చిత్రంలో ఐటం సాంగులో అందాల విందు చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా నథాలియా స్వయంగా వెల్లడించింది. 'నేను నాగార్జున్ సార్ సినిమాలో ఐటం నంబర్ చేయబోతున్నారు. అంత పెద్ద యాక్టర్ తో చేయబోతున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది' అంటూ వెల్లడించింది.
ఆమె 'డిపార్ట్ మెంట్' చిత్రంలో ఐటం సాంగ్ పెర్ఫార్మెన్స్ చూసి కుర్రకారు వెర్రెతి పోయారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ లేని విధంగా, అశ్లీలతకు మారు పేరుగా ఈ పాటను చిత్రీకరించారు. మరి నాగార్జున 'భాయ్' చిత్రంలో ఈ భామ అందాలు ఏ రేంజిలో విప్పిచూపిస్తారో?
ఇక భాయ్ సినిమా వివరాల్లోకి వెళితే..
అహ నా పెళ్లంట, పూలరంగడు వంటి హిట్ చిత్రాలను రూపొందించిన వీరభద్రం చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లీడర్, మిరపకాయ్ చిత్రాల ఫేం రీచా గంగోపాధ్యాయ్ ఇందులో కథానాయిక. 'భాయ్' చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. అదే విధంగా యాక్షన్, కామెడీ మిళితమై ఉంటుంది. ఇప్పటికే స్ర్కిప్టు వర్క్ పూర్తయిందని, కింగ్ నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని దర్శకుడు వీరభద్రం చౌదరి అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి. ప్రస్తుతం నాగార్జున 'లవ్ స్టోరీ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత అంటే డిసెంబర్లో ఈచిత్రం సెట్స్ పైకి వెళ్ల నుంది.


Click it and Unblock the Notifications











