వర్మ అడిగితే నగ్నంగా కనిపిస్తానంటోంది
వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ నుంచి నాకు అలాంటి ప్రపోజల్ ఏమీ రాలేదు. ఒకవేళ ఆయన అడిగితే అలా పూర్తిగా న్యూడ్ గా కనిపించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు అంది నథాలియా. రామ్ గోపాల్ వర్మ హాట్ ఫేవరెట్‌గా పేరు తెచ్చుకుని వర్మ 'డిపార్ట్‌మెంట్'లో ఐటం సాంగ్ చేసిన ఈ బ్రెజిల్ భామ త్వరలో పూర్తిస్థాయి నగ్నంగా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. దానిపై ఆమె మీడియా వద్ద వివరణ ఇస్తూ ఇలా స్పందించింది.
అలాగే... వర్మ తీసే ప్రతి సన్నివేశం కళాత్మకంగానే ఉంటుంది. వల్గర్‌గా ఆయన తీయరు. అందుకే భారం ఆయనపై వదిలేసి చేసేస్తా. ఒకవేళ వల్గర్‌గా అన్పించేలా నేను శృతిమించినా అది కట్ చేయడానికి సెన్సార్ వాళ్ళు ఉన్నారుగా అంది. ఇక రామ్ గోపాలవర్మ ఆమె హీరోయిన్ గా ఓ సినిమా సైతం ప్రకటించేసారు. రానా,నధాలియా కాంబినేషన్ లో అందం అనే చిత్రం చేయనున్నట్లు ఆయన కొద్ది రోజులు క్రితం మీడియాకు తెలియచేసారు.
ఇక 'డిపార్ట్ మెంట్'విషయానికి వస్తే... ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మే 18న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంపై రామ్ గోపాల్ వర్మ చాలా ఆశలు పెట్టుకున్నారు. తిరిగి తన కెరీర్ ని గాడిలో పెట్టే చిత్రం అవుతుందని ఆయన భావిస్తున్నారు. సంజయ్ తో దత్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రం పోలీస్ డిపార్టమెంట్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రోమోలలో విడుదల చేసిన ఐటం సాంగ్ మంచి పేరు తెచ్చుకుని క్రేజీగా ప్రాజెక్టుని నిలబెట్టింది.
ఈ 'డిపార్ట్ మెంట్' చిత్రంలో అమితాబ్ బచ్చన్, సజయ్ దత్, రాణా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అమితాబ్ గ్యాంగ్ స్టర్ నుంచి పొలిటీషియన్ గా మారిన పాత్రలో, సంజయ్ దత్, రాణా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ల పాత్రల్లో కనిపించనున్నాడు. వీరితో పాటు తెలుగు తారలు మధు శాలిని, మంచు లక్ష్మి కూడా నటిస్తున్నారు. మధు శాలిని లేడీ గ్యాంగ్ స్టర్ పాత్రలో సిగరెట్లు, మందు సేవించే పాత్రలో, మంచు లక్ష్మి ప్రసన్న సంజయ్ దత్ భార్య పాత్రలో నటిస్తోంది. బ్రెజిల్ మోడల్ నతాలియా హాట్ ఐటం సాంగు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.


Click it and Unblock the Notifications











