వర్మ.. మా ఇద్దరితో వివిధ భంగిమల్లో చేయించారు
దగ్గుబాటి యువహీరో రాణా బ్రెజిల్ భామ నతాలియాతో హాట్ హాట్‌గా ఫోటో షూట్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఫోటో షూట్‌పై నతాలియా ఇటీవల ఓ పత్రికతో మాట్లాడుతూ....దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మా ఇద్దరితో వివిధ భంగిమల్లో ఫోటో షూట్ చేయించారు. అందువల్లే ఫోటోలు అంత సెక్సీగా బాగా వచ్చాయని అంటోంది. రాణా హైట్, బాడీ, కండలు చాలా బాగున్నాయని, అతడు చాలా మంచి వ్యక్తి అని అంటోంది. అతడు షర్టు విప్పినప్పుడు అతని అద్భుతమైన బాడీ ముందు నేను ఓ పనిమనిషిలా అపినించాను. రాణా సూపర్బ్ ఉంటారు అంటోంది ఈ బ్రెజిల్ బ్యూటీ.
వర్మ ఈ ఇద్దరితో త్వరలో ఓ సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. నతాలియా అందాలే పెట్టుబడిగా రూపొందుతున్న ఈచిత్రానికి 'అందం' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మామూలుగానే వర్మ తన హీరోయిన్ల అందాలను ఓ రేంజ్‌లో చూపిస్తారు. ఈ సినిమా ప్రత్యేకించి నతాలియా అందాలను ఫోకస్ చేస్తూ చూపిస్తున్నారు. మరి రాణా, నతాలియా మధ్య ఈచిత్రంలో వర్మ ఎలాంటి సెక్సీ సీన్లు ప్లాన్ చేశాడో చూడాలి.
వర్మ ప్రస్తుతం హిందీలో 'డిపార్ట్ మెంట్' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాణా ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తుండగా, నతాలియా ఐటం గర్ల్ గా కనిపించనుంది.


Click it and Unblock the Notifications











