టాలీవుడ్ అవకాశాల కోసం సెక్స్ బాంబ్ ఆరాటం
ముంబై: రామ్ గోపాల్ వర్మ కొత్తగా పరిచయం చేసిన ఐటం బాంబు నథాలియా కౌర్.... డిపార్ట్‌మెంటు చిత్రంలోని ఐటం సాంగులో ఏ రేంజ్‌లో అందాలు ఆరబోసిందో తెలిసిందే. బికినీకి ఏమాత్రం తీసి పోని డ్రెస్సుతో విచ్చల విడిగా అందాలు చూపించి ఒక్కసారి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది ఈ బ్రెజిల్ భామ.
డిపార్ట్ మెంట్ చిత్రంలోని 'డన్ డన్' ఐటం సాంగులో నథాలియా పెర్ఫార్మెన్స్ చూసి కుర్రకారు వెర్రెతి పోయారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ లేని విధంగా, అశ్లీలతకు మారు పేరుగా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతాయని అనుకున్నారంతా. అయితే పరిస్థితి తారుమారైంది. నథాలియాకు ఆశించిన ఫలితాలు దక్కలేదు.
దీంతో ఈ సెక్సీ బ్రెజిల్ బ్యూటీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై, ముఖ్యంగా టాలీవుడ్ పరిశ్రమపై దృష్టి సారించింది. 'టాలీవుడ్లో పని చేయాలని ఆసక్తిగా ఉంది. టాలీవుడ్ సినిమాలు ప్రజల సింప్లిసిటీకి దగ్గరగా ఉంటాయి. రెండు ప్రాజెక్టులు తెలుగులో ఓకే అయ్యేలా ఉన్నాయి. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. సౌత్ లో ఎంటర్ అవ్వడానికి రెడీ గా ఉన్నాను' అని వెల్లడించింది నథాలియా.
సౌత్ లో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ గురించి ప్రశ్నిస్తే...'నాకు చాలా భాషలు వచ్చు. పోర్చుగీస్, ఇటాలియన్, స్పానిష్, ఇంగ్లీష్ బాగా తెలుసు. అదే విధంగా ఫ్రెంచి బాషను అర్థం చేసుకోగలను. ప్రస్తుతం హిందీ నేర్చుకుంటున్నాను. త్వరలో తెలుగు కూడా నేర్చుకుంటాను' అని నథాలియా చెప్పుకొచ్చింది. మరి వర్మ ద్వారా ఇండియా ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ సౌత్ లో తన అందాలతో ఏ రేంజిలో బీభత్సం సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications












