గుణశేఖర్ ‘రుద్రమదేవి’లో సెక్సీ నథాలియా
హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ 'రుద్రమదేవి' సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి కథానాయకుడుగా దగ్గుబాటి రాణాను ఇప్పటికే ఎంపిక చేయగా... తాజాగా బ్రెజిల్ భామ నథాలియా కౌర్ ను కూడా సెలక్ట్ చేసారు గుణశేఖర్. ఇందులో ఆమెను యువరాణి పాత్రలో చూపించనున్నారట.
రామ్ గోపాల్ వర్మ 'డిపార్ట్ మెంట్' చిత్రం ఐటం సాంగ్ ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయం అయి ఆరంగ్రేటంతోనే తన సెక్సీ అందాల ఆరబోతతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నథాలియాకు..... ఎవరూ ఊహించని విధంగా గుణ శేఖర్ రూపొందిస్తున్న రుద్రమదేవి పాత్రలో యువరాణి పాత్ర పోషించే అవకాశం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే...ఈచిత్రంలో రాణా వీరభద్రుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇంటర్నేషనల్ స్టాండర్స్ తో తీస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్స్ లో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇళయారాజా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు.
పాటల్ని లండన్‌లోని సింఫనీ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చెయిస్తున్నారు. ఈ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, విఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, కాస్ట్యూమ్స్ డిజైనర్: నీతా లుల్లా(జోధా అక్బర్ ఫేం), నిర్మాత-కథ-స్క్కీన్ ప్లే-దర్శకత్వం: గుణశేఖర్.


Click it and Unblock the Notifications












