మంచు మనోజ్ చిత్రానికి నధాలియా షాక్...వివాదం

By Srikanya

హైదరాబాద్ : మంచు మనోజ్ త్వరలో 'పోటుగాడు' గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి నధాలియా కౌర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను బికినీ వేయమని అడిగితే కుదరదన్నదని అందుకే తప్పించారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అలాగే నిర్మాత లగడపాటి శ్రీధర్ సైతం నధాలియాకు రీ ప్లేస్ మెంట్ వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

అయితే నధాలియా మాత్రం అసలు అవన్ని అబద్దాలని,తను అసలు ఈ సినిమాలో చేస్తాను లేదు అన్న విషయమే కన్ఫర్మ్ చేసి చెప్పలేదని, అలాంటిది ఎలా ఇలా కామెంట్ చేస్తారని అంటున్నట్లు బాలీవుడ్ మీడియాలో వస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ గా న్యూస్ ఏదీ రాలేదు. దర్శకుడు పవన్ మాట్లాడుతూ... మొదటే బికినీ విషయంతో సహా అన్నీ మాట్లాడం... అయితే బికినీ సీన్ రోజునే ఆమె ఇలా అడ్డం తిరిగింది. దాంతో నిర్మాతకు 15 లక్షలు నష్టం వచ్చింది అన్నారు.

కోమల్ హీరోగా వచ్చిన 'గోవిందాయ నమ:'.. చిత్రం తెలుగులో 'పోటుగాడు' గా తెరకెక్కుతోంది. కన్నడంలో దర్శకత్వం చేసిన పవన్‌ ఈ చిత్రానికి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లగడపాటి శిరీష, శ్రీధర్‌ నిర్మాతలు.

మంచు మనోజ్ చిత్రం గురించి చెప్తూ.. అటు పొగడ్తకి, ఇటు తెగడ్తకి రెండింటికీ సరిపోయే పదం 'పోటుగాడు'. నా శారీరకభాషకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. టైటిల్‌కి తగ్గట్టే ఇందులో తన పాత్ర కూడా ఉంటుందని మనోజ్ అంటున్నారు. ఈ చిత్రంలో మనోజ్‌ సరసన నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సాక్షి చౌదరి, సిమ్రాన్‌ ముండి, నథాలియా కౌర్‌లతోపాటు మరో హీరోయిన్ కు చోటుంది. ఇటీవల కర్ణాటకలోని బీజాపూర్‌లో కీలక సన్నివేశాలతోపాటు ఓ పాటను తెరకెక్కించారు.

నిర్మాతలు మాట్లాడుతూ... ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. 'పోటుగాడు'గా మనోజ్‌ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తారు. కథ, కథనాలు సాగే విధానంలో వైవిధ్యం ఉంటుంది. బీజాపూర్‌లో పేరొందిన గోల్‌ గుంబస్‌, ఇబ్రహీం రోజా ప్రాంతాల్లో చిత్రీకరించిన పాట సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

అలాగే... ఈ సినిమాకి హాలీవుడ్‌కి చెందిన ఫైట్‌ మాస్టర్లు పని చేయబోతున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. యూరప్‌లో కొన్ని పాటల్ని తెరకెక్కిస్తాము అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌, సంగీతం: చక్రి, మాటలు: శ్రీధర్‌ సీపాన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X