హాట్ టాపిక్:ఆమె సన్నిలియోన్ కాదు
మొదట నధాలియాకౌర్ ని ఈ చిత్రానికి అనుకుని ఫోటో షూట్ చేసారు. పూజా భట్ ఫామ్ హౌస్ లో ఈ ఫోటో షూట్ ని జోయ్ దత్తా చేసారు. ఆ తర్వాత మల్లికా షెరావత్ ని కూడా పోటో షూట్ చేసి చూసారు. అయితే ఇద్దరూ సెట్ కాలేదు. దాంతో పైనల్ గా సన్నిలియోన్ ని ఎంపిక చేసి సినిమాని తీసారు.నిజ జీవితంలో పోర్న్ స్టార్ అయిన సన్నీ లియోన్ తన బాలీవుడ్ ఎంట్రీ మూవీ జిస్మ్-2లోనూ నిజ జీవిత పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లలో సన్నీ లియోన్ అందాల ఆరబోత, ఘాటైన ముద్దు సన్ని వేశాలు, అర్ధనగ్న సీన్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి.
ఇక జిస్మ్ 2 లో సన్నిలియోన్ ఇజ్న గా తన నిజ జీవిత పాత్రైన ఫోర్న్ స్టార్ గానే చేసింది. కథ విషయానికి వస్తే..కబీర్ విల్సన్ (రణదీప్ హుడా)ను ప్రేమించిన ఇజ్న అతని చేతిలో మోస పోతుంది. తన మోసపోయాననే విషయం తట్టుకోలేక ఇజ్న చనిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఇంటలిజెన్స్ ఏజెంట్ అయాన్ ఠాకూర్ (అరుణోదయ్ సింగ్) ఆమెను చనిపోకుండా నిలువరించి చని పోయే బదులు దేశం కోసం పని చెయ్యమని కోరుతాడు. తనకు ఇష్టం లేక పోయినా అయాన్ కన్విన్స్ చేయడంతో ఒప్పుకుంటుంది. వీరు ఇద్దరు కలిసి కబీర్ ని చంపడానికి ప్లాన్ చేస్తారు. మరి కబీర్ ఎవరు? అయాన్ అతన్ని చంపడానికి ఎందుకు ప్లాన్ చేశాడు? మరి ఇజ్న చివరకు ఏం చేసింది? అనేది తర్వాతి కథ.
ఇక ఈ చిత్రం చూసిన వారు...సినిమా ట్రైలర్లు చూసి ఈ చిత్రంలో మసాలా సీన్లు ఉన్నాయని ఆశించి వెళితే నిరాశ తప్పదు అని తేల్చి చెప్పారు. రెండు మూడు చోట్ల ముద్దు సీన్ల తప్ప ఘాటైన సన్నివేశాలు ఏమీ లేవు. మహేష్ భట్ తీసిన జిస్మ్, మర్డర్ చిత్రాల్లో ఉన్నంత వేడి వేడి సీన్లు ఈచిత్రంలో కనిపించవు. అసలు సినిమానే స్టోరీ చెత్తగా ఉంది. కేవలం సన్నీ లియోన్ ను బాలీవుడ్ కి పరిచయం చేయడానికే ఈచిత్రం తీసినట్లుంది అన్నారు.


Click it and Unblock the Notifications












