twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాక్ జాతీయ గీతాన్నీ గౌరవిస్తా, అక్కడ విలువైన గీతాన్ని ప్రసారం చేయకూడదు. ? : సోనూ నిగమ్

    |

    సినిమా థియేటర్లలో జాతీయ గీతం అంసం పై దేశవ్యాప్త చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. దీనిపై ప్రముఖులంతా తలా ఒక మాట చెప్తూనే ఉన్నారు. . సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ గతేడాది సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. అయితే, ఆ తీర్పులోని shall(ఖచ్చితంగా) పదం స్థానంలో May(ఇష్టాన్ని బట్టి ) అనే పదాన్ని చేర్చాలని ఇటీవల సుప్రీంకోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో మళ్ళీ ఈ విషయం తెరమీదకు రావటంతో మళ్ళీ చర్చ మొదలయ్యింది.

    జాతీయ గీతాన్ని గౌరవించటం అంటే

    జాతీయ గీతాన్ని గౌరవించటం అంటే

    అయితే సినిమా వాళ్ళలో మాత్రం ఈ విషయం లో నెగెటివ్ స్పందనే ఉంది. జాతీయ గీతాన్ని గౌరవించటం అంటే సినిమా థియేటర్లలో నిలబడటం కాదన్న అభిప్రయమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే అరవింద్ స్వామీ, కమల్ హాసన్ లు తమ అభిప్రాయాన్ని చెప్పేసారు...

     అరవింద్ స్వామి

    అరవింద్ స్వామి

    గతసంవత్సరం జాతీయ గీతాన్ని థియేటర్లలో వినిపించాలనే ప్రకటన వచ్చిన రెండు రోజులకే అరవింద్ స్వామి తన అభిప్రాయాన్ని ఇలా చెప్పారు ''అసలు థియేటర్లో సినిమాకి ముందు జాతీయ గీతం ఎందుకు ప్రదర్శించాలో ఎవరైనా వివరిస్తారా? ఎక్కడైనా దేశానికి ప్రాతినిధ్యం వహించే చోట.. లేదా వేలమంది గుమిగూడేఒక క్రీడా సంబంధిత ఈవెంట్లోనో జాతీయగీతం పాడించడం అంటే అర్థం చేసుకోవచ్చు.

    ఉపహార్ థియేటర్‌ దుర్ఘటన

    ఉపహార్ థియేటర్‌ దుర్ఘటన

    కానీ థియేటర్లలో వందల మందిని లోపల బ్లాక్ చేసి ఎగ్జిట్లు మూసేసి జాతీయ గీతం పాడించడమేంటో అర్థం కావడం లేదు. ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తే బాగుంటుంది. 1997 లో ఉపహార్ థియేటర్లలో ఎగ్జిట్లు లాక్ చేయడం వల్ల జరిగిన దుర్ఘటనను ఈ సందర్భంలో ఓసారి గుర్తు చేసుకోవాలి'' అని అరవింద్ స్వామి అన్నాడు.

    పార్లమెంటు హాలులో రోజూ ఆలపించరు

    పార్లమెంటు హాలులో రోజూ ఆలపించరు

    సరిగ్గా సంవత్సరం తర్వాత సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవలన్న నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు కూడా "గవర్నమెంట్ ఆఫీసులు - కోర్టులు - అసెంబ్లీలు - పార్లమెంటు హాలులో రోజూ జాతీయ గీతం ఎందుకు ఆలపించరు. వినోదం కోసం ఉన్న సినిమా హాళ్లలోనే జాతీయ గీతం వినిపించడం ఎందుకు తప్పనిసరి చేశారు?'' అంటూ ట్విట్టర్ వేదికగా తన సందేహం వ్యక్తం చేశాడు అరవిందస్వామి.అయితే పోయిన సంవత్సరం ఆయన వ్యాఖ్యలకు వచ్చినంత వ్యతిరేకత ఈ సారి లేకపోవటం గమనించదగ్గ విషయం.

    నా దేశభక్తికి పరీక్షలు పెట్టొద్దు

    నా దేశభక్తికి పరీక్షలు పెట్టొద్దు

    ఇక కమల్ హాసన్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పేసాడు... "ఎక్కడ పడితే అక్కడ నా దేశభక్తికి పరీక్షలు పెట్టొద్దు. దేశభక్తిని చాటుకోవాలని నన్ను బలవంతం చేయొద్దు" అని చెప్పిన కమల్ జాతీయ గీతాన్ని కేంద్ర ప్రభుత్వం దూరదర్శన్ చానెళ్లలో ప్రసారం చేయువచ్చని, అంతేకానీ పౌరులను బలవంతం చేయురాదంటూ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేసాడు.

    సింగర్ సోనూ నిగమ్

    సింగర్ సోనూ నిగమ్

    ఈ విషయం గురించే తన అభిప్రాయం కూడా తెలియ జేసాడు "విపరీత దేశభక్తుడు" అని గత సంవత్సరం విమర్శించబడ్డ సింగర్ సోనూ నిగమ్. అయితే..! ఈసారి మాత్రం సోనూ స్పందన కూడా కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంది. పాకిస్థాన్‌ జాతీయగీతం ప్రసారమవుతున్నప్పుడు నేను కూడా నిలబడతాను.

     ఈ నిర్ణయంతో ఏకీభవించడంలేదు

    ఈ నిర్ణయంతో ఏకీభవించడంలేదు

    కేవలం సినిమా థియేటర్లలోనే జాతీయ గీతం ప్రసారం చేయాలని కొందరుఅభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఈ నిర్ణయంతో ఏకీభవించడంలేదు.జాతీయ గీతం ఎంతో విలువైనది. నాకు తెలిసినంతవరకు థియేటర్లు, రెస్టారెంట్‌ వంటి ప్రదేశాల్లో మన విలువైన గీతాన్ని ప్రసారం చేయకూడదు.

     ఈ విషయంలో అహం పనికిరాదు

    ఈ విషయంలో అహం పనికిరాదు

    నా తల్లిదండ్రులంటే నాకు ఎంతో గౌరవం. వారికి కొన్నిప్రదేశాల్లో గౌరవం దక్కదు అని తెలిసినప్పుడు వారిని ఆ ప్రదేశాలకు ఎందుకు తీసుకెళతాను? ఎక్కడికి వెళ్లినా వారికి గౌరవం దక్కాలి. అదే విధంగా ఎక్కడైతే జాతీయ గీతానికి గౌరవం ఇవ్వరో అలాంటి ప్రదేశాల్లోప్రసారం చేయకూడదు. ఒకవేళ ప్రసారమైతే మనం నిలబడాలి. ఈ విషయంలో అహం పనికిరాదు. నేనైతే మన దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా లేచి నిలబడతాను' అంటూ చెప్పేసాడు.

    English summary
    Bollywood singer Sonu Nigam said that one should respect national anthem, but it should not be played in cinema halls. He also talked about the azaan controversy and his Twitter episode.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X