ప్రకాష్ రాజ్ కి జాతీమ అవార్డు
ప్రకాష్ రాజ్ ఒక మంచి నటుడు మాత్రమే కాదు మంచి స్వభావమున్న వ్యక్తి. తన నటనా చాతుర్యంతో ఆడియెన్స్ ను మెప్పించ గల నటనా సామర్థ్యం తనంతట తానూ నిరూపించుకొన్నారు. ప్రియుడి పాత్ర నుంచి కురు వద్ధుడి క్యారెక్టర్ వరకు ఏదిచ్చినా...అందులో ఒదిగిపోయే నటుడు ఎవరంటే...వెంటనే గుర్తుకొచ్చేది ప్రకాష్ రాజ్. ప్రియుడు, బావ, అన్న, తండ్రి, తాత, ఇలా ప్రతి పాత్రకూ వన్నె తెచ్చేనటుడు ప్రకాష్ రాజ్ ఈ నెలలో జరగబోవు 55వ టోరంటో ఫిల్మ్ ఫేర్ ఫెస్టివల్ లో జాతీయ ఉత్తమ నటుడు అవార్డును, ఉత్తమ దర్శకుడు అవార్డును ప్రియదర్శిని అందుకోబోతున్నారు.
ఇంకా జాతీయ అవార్డు అధికారికంగా ప్రకటించకపోయినా...అనధికార సమాచారం ప్రకారం 2007లో ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన 'కంచీవరం" చిత్రానికిగాను ఉత్తమ నటుడు అవార్డు ప్రకాష్ రాజ్ ను వరించిందట! కంచీపురం కథ వినగానే తను పేమెంట్ పరంగా ఎంటువంటి డిమాండ్స్ లేకుండా నటించుటకు అంగీకరించారు.ఇందులో ప్రకాష్ రాజ్ నేత కార్మికుడిగా నటించాడు. ఈ పాత్రలో తన నటనతో చేనేత కార్మికులు ఎదుర్కొనే సమస్యలను 1952 ఆదారంగా చిత్రీకరించారు. ఇందులో అతను ప్రదర్శించిన ప్రతిబాపాటవమే తనకు ఈ అవార్డును పొందే అర్హత కలిగిందని తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











