‘సాఫ్ట్ ఫోర్న్ నటికి జాతీయ అవార్డు’
బాలీవుడ్ హాట్ గర్ల్ విద్యాబాలన్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న డర్జీ పక్చర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్య ఇందులో సాఫ్ట్ ఫోర్న్ యాక్టింగ్ కు తెరలేపింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన విద్యా హాట్ ఫోటోలు కుర్రకారు గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి.
ఈ సినిమా గురించి నిర్మాత ఎక్తా కపూర్ మాట్లాడుతూ...విద్యా శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని, సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్టవుతుందని చెప్పడమే కాదు, ఈ సినిమాలో విద్య పోషించిన పాత్రకు జాతీయ అవార్డు రావడం ఖాయం అని జోస్యం చెబుతోంది.
డర్టీ పిక్చర్ సినిమా గురించిన విషయాలను వెల్లడిస్తూ...సిల్క్ స్మిత జీవితం మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుందని, పేద గ్రామం నుంచి వచ్చిన స్మిత సాఫ్ట్ ఫోర్న్ స్టార్ గా ఎలా ఎదిగింది. ఆ తర్వాత ఆమె జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి అనే విషయాలు సినిమాలో ఉంటాయన్నారు.
ఇదిలా ఉంటే..స్మిత పాత్రకు విద్యాబాలన్ సెట్ కాలేదని మరి కొందరు విమర్శిస్తున్నారు. 5.7 అడుగుల హైట్ తో స్మిత పాత్రకు, 5.2 అడుగుల పొడవు మాత్రమే ఉండే విద్యను ఎంపిక చేయడం ఏమిటి? పైగా స్మితవి పెద్ద కళ్లు, ఆమె హావ భావాల్లో ఓ వైవిద్యం ఉంటుంది...విద్యకు ఆమెకు చాలా తేడాలో ఉన్నాయి అని అంటున్నారు.
మరి స్మిత పాత్రలో విద్యను ప్రేక్షకులు ఆమోదిస్తారో? ఎక్తా చెప్పినట్లు విద్య జాతీయ అవార్డు అందుకుంటుందో? లేక ఈ సినిమా విద్యా జీవితంలో మరేమైనా అనుకోని మార్పులు తెస్తుందో? చూద్దాం...


Click it and Unblock the Notifications











