పవన్ తో నేషనల్ అవార్డు విన్నర్

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాళి షూటింగ్ ప్రస్తుతం కేరళలోని పొల్లాచ్చిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఆ పాటను 2010 లో నేషనల్ అవార్డు అందుకున్న కొరియో గ్రాఫర్ దినేష్ కొరియోగ్రఫి అందిస్తున్నారు.ధనుష్ చేసిన ఆదుకాలం చిత్రానికి ఈ అవార్డు అందింది.ఇక కాళి చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణు వర్దన్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత కొన్ని వారాలుగా కోల్ కతాలో జరుగుతోంది. కథ ఎక్కువగా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సాగడం వల్ల సగం భాగం షూటింగ్ అక్కడే చేసారు.

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తొలిసారిగా గెడ్డం పెంచి మరీ నటిస్తున్నాడు. పవన్ అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా విష్ణువర్థన్ ఈ చిత్రంలో మసాలా అంశాలని జోడిస్తున్నాడు.తిరుమల శెట్టి నీలిమా మరియు శోభు యార్లగడ్డ కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాకి మొదట్లో 'ది షాడో' అనే టైటిల్ పెట్టాలని దర్శకుడు ఉబలాటపడ్డాడు. అయితే, పవన్ కల్యాణ్ కి ఆ టైటిల్ నచ్చకపోవడంతో దానిని వర్కింగ్ టైటిల్ గా అనుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X