twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌ బాస్ షో వివాదంలో శ్వేతా రెడ్డి ఏం సాధించింది? అనే వారికి దిమ్మదిరిగే సమాధానం...

    |

    బిగ్ బాస్ షో విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకుంది, రేటింగులు కూడా బాగా వస్తున్నాయి. శ్వేతా రెడ్డి కేసులు పెట్టి ఏం సాధించింది? శ్వేతారెడ్డి పుణ్యమా అంటూ బిగ్ బాస్ రికార్డులు బద్దలు కొడుతోంది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. ఈమె ధర్మపోటారాలు చేసింది, దీక్షలు చేసింది, ధర్నాలు చేసింది, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరాటమే చేసింది, ప్రెస్ మీట్లు పెట్టింది, ఏం సాధించింది శ్వేతారెడ్డి అని కొందరు ఎగతాళి చేస్తున్నారు. అలా నోరు పారేసుకున్న వారికి తగిన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు శ్వేతారెడ్డి.

    శ్వేతారెడ్డి కేసుపై స్పందించిన ఉమెన్ కమీసన్

    శ్వేతారెడ్డి కేసుపై స్పందించిన ఉమెన్ కమీసన్

    నేషనల్ ఉమెన్ కమీషన్ నుంచి లెటర్ అందుకున్న ఆమె అందులో ఏముందో వెల్లడించారు. సీపీ అంజనీకుమార్ గారికి ఉమెన్ కమీషన్ లెటర్ పంపినట్లుగా తనకు ఒక రిఫరెన్స్ లెటర్ అందిందని, శ్వేతారెడ్డి పెట్టిన కేసుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే విషయంలో వివరణ ఇవ్వాలని సీపీ అంజనీ కుమార్‌ను అందులో ఆదేశించినట్లు తెలిపారు.

    ఇక్కడ న్యాయం జరుగక పోయినా ఢిల్లీ స్థాయిలో న్యాయం

    ఇక్కడ న్యాయం జరుగక పోయినా ఢిల్లీ స్థాయిలో న్యాయం

    ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పట్టించుకోనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది, ఇక్కడ న్యాయం జరుగక పోయినా ఢిల్లీ స్థాయిలో మనకు న్యాయం జరుగుతుంది అనే విషయం మనకు ఈ లెటర్ ద్వారా తేటతెల్లం అయిందని శ్వేతారెడ్డి తెలిపారు.

    ముందుంది ముసళ్ల పండగ

    ముందుంది ముసళ్ల పండగ

    ఎవరైతే నాపై అనవసరంగా నోరు పారేసుకున్నారో వారికి ఒకటే చెబుతున్నాను. బిగ్ బాస్ షో రన్ అవుతున్నంత మాత్రాన శిక్ష పడకుండా తప్పించుకోలేరు అనేది చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. ఏదో అయిపోయిందిలే... రెండ్రోలు అరిచి సైలెంట్ అయిపోయింది అనుకోవద్దు. ఇప్పుడుంది అసలు సంగతి, ముందుంది ముసళ్ల పండగ. నేను మొదటి రోజు నుంచీ ఇదే చెబుతున్నాను. టైమ్ అన్నింటికీ సమాధానం చెబుతుందని శ్వేతారెడ్డి వ్యాఖ్యానించారు.

    వారికి త్వరలో శిక్ష పడబోతోంది

    వారికి త్వరలో శిక్ష పడబోతోంది

    ఎవరైతే సెక్సువల్ హరాస్మెంట్ చేస్తారో, అమ్మాయిలను కాస్టింగ్ కౌచ్ పేరుతో వేధిస్తున్నారో, బిగ్ బాస్ షోలో సెలక్ట్ చేయాలంటే అమ్మాయిలతో చిచ్చోరా వేషాలు వేస్తున్నారో వారందరికీ త్వరలో శిక్ష పడబోతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు అని శ్వేతా రెడ్డి తెలిపారు.

    అమ్మాయిలు ధైర్యంగా ఫిర్యాదు చేయండి

    అమ్మాయిలు ధైర్యంగా ఫిర్యాదు చేయండి

    ఈ సందర్భంగా ఆడపిల్లలకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎక్కడ వేధింపులు ఎదురైనా, లెక్చరర్లు, తోటి విద్యార్థులు, బస్టాండ్, రోడ్ల మీద వెళుతున్నపుడు ఎవరైనా వేధించినా అధైర్య పడొద్దు. పోలీసులకు ఫిర్యాదు చేయండి. అవసరం అయితే ఢిల్లీ వెల్లి నేషనల్ ఉమెన్ కమీషన్‌కు ఫిర్యాదు చేయండి, అక్కడి వరకు వెళ్లే పరిస్థితి లేకుంటే ఉమెన్ కమీషన్ వెబ్ సైట్లో అయినా ఫిర్యాదు చేయండి అని శ్వేతారెడ్డి సూచించారు.

    వారి చరిత్రను తీసిమరీ అరెస్ట్ చేస్తున్నారు

    వారి చరిత్రను తీసిమరీ అరెస్ట్ చేస్తున్నారు

    సైబర్ కంప్లయింట్స్ విషయంలో పోలీస్ డిపార్టుమెంట్ సీరియస్‌గా ఉంది. మిమ్మల్ని ఎవరైనా ట్రోల్ చేసినా ఫిర్యాదు చేయండి. పోలీసులు వారి చరిత్రను తీసిమరీ అరెస్ట్ చేస్తున్నారు. మన షర్మిలగారి విషయంలో అదే జరిగింది. రెండు సంవత్సరాల తర్వాత ఆ వెధవలను వెతికి పట్టుకున్నారని శ్వేతారెడ్డి గుర్తు చేశారు.

    English summary
    National Commission for Women responded on Swetha Reddy's Bigg Boss case. NCW has brought to the notice of CP, Anjani Kumar, IPS, Telangana asking the status of the case received from Swetha Reddy and others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X