ధనుష్ 'త్రీ'కి కలెక్షన్స్ గురించి
ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన 'త్రీ' శుక్రవారం విడుదలైంది. ఐశ్వర్య ధనుష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నట్టికుమార్ కలెక్షన్స్ గురించి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ...నేను ఇప్పటిదాకా 61 సినిమాలు తీస్తే వాటన్నింటిలోకి 'త్రీ' గొప్ప కలెక్షన్లను రాబట్టుతోంది. రెండో రోజే 20 థియేటర్లను పెంచాం. ధనుష్‌కి తెలుగులో పెద్ద మార్కెట్ లేకపోయినా పెద్ద సినిమాల స్థాయిలో హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి...కేవలం సబ్జెక్ట్‌కున్న క్రేజ్‌తోనే జనాలు విపరీతంగా సినిమాను చూస్తున్నారు.
క్యూబ్ విధానం ఉన్న థియేటర్లలో మాత్రం సర్వెర్లు డౌన్ కావడంతో షో పడటం ఆలస్యమైంది. దీనికి ఛాంబర్ వాళ్ళు సమాధానం చెప్పాలి. భవిష్యత్తులోనూ డిజిటల్ విధానాన్ని ప్రోత్సహించకూడదు. ప్రింట్‌లనే ప్రోత్సహించాలి అన్నారు. ఇక త్రీ చిత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నా..సెకండాఫ్ ఇబ్బందిగా మారటం కొంతమందికి నచ్చటం లేదు. ఇక సినిమాలో వై దిస్ కొలావరి పాటకు మంచి స్పందన వస్తోంది. ధనుష్ గతంలో రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమాలేవీ ఈ రేంజి ఓపినింగ్స్ తెచ్చుకోకపోవటం విశేషం.


Click it and Unblock the Notifications











