నట్టికుమార్ చేతికి వర్మ...

By Staff

నితిన్ హీరోగా రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేసిన అజ్ఞాత్ (అడవి) చిత్రం తెలుగు డబ్బింగ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ నట్టికుమార్ సొంతం చేసుకున్నారు. చిన్న సినిమాలు, ముఖ్యంగా సెక్స్ సినిమాలు నిర్మించే అతను ఈ చిత్రం హక్కులు పొందటంపై పరిశ్రమలో ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం హక్కులు తీసుకోవటానికి పేరున్న సంస్ధలు ఎవరూ ముందుకురాకపోవటంతో ఈ పరిస్ధితి వచ్చిందని తెలుస్తోంది. అందులోనూ నితిన్ కి వరస ఫ్లాఫ్ లు రావటం, వర్మ సినిమాలు సైతం ఇక్కడ అంతంత మాత్రంగా ఆడటం దెబ్బ తీసిందంటున్నారు. అడవి పేరుతో రిలీజయ్యే ఈ చిత్రంలో నిషా కొఠారి హీరోయిన్ గా చేస్తోంది. సినిమా షూటింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం నడుస్తుంది. ఇందులో అసెస్టెంట్ డైరక్టర్ గా నితిన్ చేస్తున్నాడు. అయితే నట్టి కుమార్ ఈ చిత్రాన్ని వంద ప్రింటులతో భారిగానే రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు ఏడున ఈ చిత్రం ఆంధ్రదేశమంతటా రిలీజవనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X