రామ్ చరణ్ తేజ్‌పై నట్టి కుమార్ ధ్వజం: క్షమాపణ చెప్పాలని డిమాండ్
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావుపై చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలపై దాసరి శిష్యుడు, ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ శనివారం ధ్వజమెత్తారు. దాసరి పేరు ఎత్తే అర్హత కూడా రామ్ చరణ్ తేజ్‌కు లేదన్నారు. ఆ స్థాయి లేదని అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలను తానే చేశాడా లేక ఎవరైనా చేయించారా తెలియాలన్నారు. దాసరిని చిరంజీవితో పాటు అల్లు రామలింగయ్య సైతం పేరు పెట్టి పిలవలేదని కాని రామ్ చరణ్ తేజ్ మాత్రం పేరు పెట్టి మాట్లాడటాన్ని ఆయన ఖండించారు.
దాసరి అనుభవమంత వయసు కూడా ఆయనకు లేదని విమర్శించారు. వయసుకు తగ్గట్లు మాట్లాడాలని సూచించారు. దాసరిపై రామ్ వ్యాఖ్యలకు చిరంజీవి కుటుంబం ఆయనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా శుక్రవారం హైదరాబాదులోని ఓ హోటల్లో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో రామ్ చరణ్ తేజ్ అవార్డు ఫంక్షన్లకు హీరోయిన్లు రావడం లేదన్న వ్యాఖ్యలను ఖండించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











