దిల్ రాజు బెదిస్తున్నాడంటూ కంప్లైంట్
''దిల్ రాజుతోపాటు కొంతమంది అగ్ర నిర్మాతలు నాపై వివక్ష చూపించడమే కాకుండా నేను నిర్వహిస్తున్న థియేటర్‌లలో సినిమా ప్రదర్మిస్తే సినిమా ఇవ్వమని పంపిణీదారుల్ని బెదిరిస్తున్నారు అంటున్నారు నిర్మాత నట్టికుమార్. ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిర్మాతల సెక్టార్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. అయితే ఆ పదవికున్న విలువ కూడా నాకివ్వడం లేదు. కొంతమంది నాపై వివక్ష చూపిస్తున్నార''ని ఆరోపించారు. అలాగే మూలనపడిపోయిన థియేటర్‌లను మరమ్మత్తులు చేయించి ఉన్నతంగా తీర్చిదిద్దాను. నా కారణంగా పంపిణీదారులు ఇబ్బందులుపడటం ఇష్టం లేదు. కొంతమంది అగ్ర నిర్మాతలు, లీజుదారులు, పంపిణీదారులు సేవా పన్ను రూపంలో ప్రభుత్వానికి కోట్ల రూపాయలు చెల్లించాలి.
వారు 45 రోజుల్లో చెల్లించకపోతే సీబీఐ విచారణ జరిపించాలంటూ హైకోర్టులో కేసు వేస్తాను అంటున్నారు. ఇక నట్టికుమార్ ఆరోపణలకు దిల్ రాజు స్పందించలేదు. నట్టికుమార్ చాలా కాలంగా పెద్ద నిర్మాతలపై ధ్వజం ఎత్తుతూనే ఉన్నారు. మరో ప్రక్క ఆయన జగపతిబాబు వంటి హీరోలతో చేసిన సినిమాలు భాక్సా ఫీస్ వద్ద అపజయం సాదించాయి. ఇక దిల్ రాజు ప్రస్తుతం సిద్దార్ద హీరోగా ఓహ్ మై ప్రెండ్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరచయమవుతున్నాడు.


Click it and Unblock the Notifications











