పండక్కి పరాయి సినిమా వద్దు: ‘ఐ’పై వివాదం
హైదరాబాద్: సంక్రాంతి పండక్క పరాయి సినిమాలకు ఛాన్స్ ఇవ్వొద్దని, తెలుగు సినిమాలకే ఛాన్స్ ఇవ్వాలని తెలుగు చిన్న నిర్మాత అయిన నట్టి కుమార్ వాదిస్తున్నారు. ‘ఐ' సినిమాను సంక్రాంతికి అనుమతి ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇతర తెలుగు సినిమాలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు.
సంక్రాంతి బరిలో ‘గోపాల గోపాల' లేదా ‘టెంపర్' లేకుంటే..... చిన్న సినిమాలకు ఛాన్స్ ఇవ్వాలి. పటాస్, బందిపోటు లాంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఫిల్మ్ ఛాంబర్లో తిష్టవేసిన కొందరు బడా నిర్మాతలు పరాయి సినిమా అయిన ‘ఐ' సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పండగ సమయాల్లో డబ్బింగ్ సినిమాలకు అనుమతి ఇవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కావాలనే తమ లాభం కోసం ఇలా చేస్తున్నారని నట్టి కుమార్ ఆరోపిస్తున్నారు.

‘ఐ' సినిమాపై మాకు ఎలాంటి పర్సనల్ వివాదం లేదు. తెలుగు చిన్న సినిమాలకు పండగ పూట థియేటర్లు దొరకడం లేదనే మాబాధంతా. ‘ఐ' లాంటి పెద్ద సినిమాలను ఎప్పుడు విడుదల చేసినా కలెక్షన్లు బాగానే వస్తాయి. చిన్న తెలుగు సినిమాలకు పండగ సందర్భంగా విడుదల చేసుకునే అవకాశం కల్పిస్తే ఇక్కడి నిర్మాతలకు ఎంతో కొంత మేలు కలుగుతుంది' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











