పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ నట్టికుమార్
సి.కళ్యాణ్ వంటి అవినీతిపరుడ్ని ఇండిస్టీ పిలిచి గౌరవించిందని, ఇది ఫిలిం ఛాంబర్ అసమర్ధతకు నిదర్శనం. దీనికి దాసరినారాయణరావు కూడా బాధ్యత వహించాలి. రోజుకోమాట మాట్లాడే పెద్దలకంటే స్ట్రెయిట్ ఫార్వెడ్‌గా ఉండే పవన్‌కళ్యాణ్ ఎంతో మేలు అంటూ సెక్టార్ కౌన్సిల్ ఛైర్మన్ నట్టికుమార్ చాలా ఆవేదనతో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నిర్మాతల సెక్టార్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన మీడియాను కలిసి ఈ విధంగా స్పందించారు. అలాగే అదేవిధంగా ఎఫ్‌డిసి కమీషనర్‌గా గతంలో బాధ్యతలు నిర్వహించిన రమణాచారి, పార్థసారథిల పనితీరును తప్పుపట్టారు. వారు ఫిలింనగర్ భూ కేటాయింపుల్లో కుంభకోణాలకు పాల్పడ్డారనీ, సాక్ష్యాధారాలు తనవద్ద ఉన్నాయనీ, వారిపై సిబిఐ దర్యాప్తు చేయాలని కోరారు. మరోవైపు ఇండిస్టీ పెద్దలు 2004 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వానికి కట్టాల్సిన సర్వీస్‌టాక్స్‌లో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని, దీనివల్ల 350 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం చేకూర్చారనీ, దానిపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తాననీ అన్నారు.
సమావేశానంతరం తన పదవికి నట్టికుమార్ రాజీనామా చేశారు. నిర్మాతల సెక్టార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా నేను చేయాలనుకొన్న ప్రతి పనికీ కొద్దిమంది అడ్డుపడుతున్నారు. ఐదు పర్యాయాలు సర్వ సభ్యసమావేశం నిర్వహించినా పెద్ద నిర్మాతలెవ్వరూ హాజరుకావటం లేదు. ఎవ్వరూ విలువనివ్వట్లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. అందుకే సెక్టార్ కౌన్సిల్ ఛైర్మన్ పదవితోపాటు, నిర్మాతల మండలి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. గతంలో ఆ పోస్టుల్లో ఉన్న వ్యక్తులు నిర్వహించిన సమావేశానికి ఇండిస్టీ పెద్దలు హాజరయ్యేవారనీ, తాను ఎన్నికైన తర్వాత నుంచి అగ్ర నిర్మాతలెవరూ హాజరుకాలేదనీ, తనకు తెలీయకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారనీ అందుకే కలత చెంది రాజీనామా చేస్తున్నట్లు వివరించారు అని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications











