ధనుష్, శృతి హాసన్ లపై నట్టికుమార్ ఫైరింగ్
రెండు వారాల క్రితం ధనుష్, శృతి హాసన్ నటించిన త్రి చిత్రం విడుదలైంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ రైట్స్ ని నట్టికుమార్ తీసుకుని భారీగా విడుదల చేసారు. అయితే ఈ చిత్రం మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ మూటకట్టుకోవటంతో కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. దానికి తోడు త్రీ చిత్రం యూనిట్ కూడా ప్రచారానికి రాలేదు. ఈ విషయమై నట్టికుమార్ మండిపడుతున్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'త్రీ సినిమా ప్రచారానికి చిత్ర యూనిట్ రాకపోవడం శోచనీయం. మేం ధనుష్‌కున్న మార్కెట్‌కన్నా ఎక్కువ పెట్టి సినిమాని కొన్నాం. సినిమా విడుదలయ్యాక యూనిట్ ప్రచారానికి రాలేదు.దీనివల్ల సినిమాకి టాక్ బాగున్నా ప్రమోషన్ లేక కొన్ని కేంద్రాల్లో కలెక్షన్లు వీక్‌గా ఉన్నాయి. ఆర్టిస్టుల సహకారం లేకపోతే ప్రమోషన్ చేయడం కష్టం. అందుకే ఇకపై ప్రమోషన్ విషయంలో సినిమా విడుదలకు ముందే అగ్రిమెంట్ రాసుకోవాలి'' అని అన్నారు.
ఇక త్రి విషయానికి వస్తే ఈ చిత్రం వై దిస్ కొలావరి పాటతో పాపులర్ అయ్యింది. ఆ పాట క్రేజ్ తో ఈ చిత్రం వర్కవుట్ అవుతుందని అంతటా భావించారు. అయితే ఆ పాట జనాలని కేవలం ధియోటర్స్ కి లాక్కురావటానికి మాత్రమే తోర్పడింది. అంతేగాక చిత్రంలో ఆ పాటే మైనస్ అయింది. యూట్యూబ్ లో ఆ పాట పాపులర్ అయిన విధంగా సినిమాలో కిక్కు ఇవ్వలేకపోయింది. ఈ నేపధ్యంలో నట్టికుమార్ ఈ సినిమా ప్రమేషన్ ప్లస్ అవుతుందని భావిస్తే అదీ వారు రాకపోవటంతో నిరాశకు గురైంది.
ముఖ్యంగా త్రీ సినిమాలో సెకండాఫ్ బాగా మైనస్ గా మారింది. హీరో మొదటి సీన్ లోనే చనిపోవటం..ఆ క్రైమ్ ముడిని విప్పుతూ సెకండాఫ్ నడిపే ప్రయత్నం చేయటం,హీరోకి ఓ మానసిక రోగం పెట్టడం వంటివి ప్రేక్షకులు డైజస్ట్ చేసుకోలేకపోయారు. దాంతో రెండో రోజుకే జనం ధియోటర్స్ వద్ద పలచబడ్డారు. మరో ప్రక్క రచ్చ వంటి పెద్ద చిత్రాలు వచ్చి యూత్ కలెక్షన్స్ ని,ధియోటర్స్ ని ఆక్యుపై చేసాయి.


Click it and Unblock the Notifications











