twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాత సి.కళ్యాణ్ సెన్సార్ బోర్డ్‌ని మోసం చేశాడు

    By Srikanya
    |

    'శివతాండవం'ని లో బడ్జెట్‌తో నిర్మించానని, స్ట్రయిట్ చిత్రం అని చూపించి పన్నుని ఎగ్గొట్టడం కోసం ఇటు ప్రభుత్వాన్ని, అటు సెన్సార్ బోర్డ్‌ని మోసం చేశాడు నిర్మాత సి. కళ్యాణ్. ''శివతాండవం స్ట్రయిట్ చిత్రం కాదు.. అనువాద చిత్రం. కానీ సి.కళ్యాణ్ దీన్ని స్ట్రయిట్ చిత్రమని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎఫ్‌డీసీని తప్పుదోవ పట్టించాడు'' అంటూ ఆరోపించారు నిర్మాతల సెక్టార్ అధ్యక్షుడు నట్టికుమార్. విక్రమ్, జగపతిబాబు కాంబినేషన్‌లో రూపొందిన తమిళ చిత్రం 'తాండవం'. యూటీవీ మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'శివతాండవం' పేరిట విడుదల చేస్తున్నారు సి.కళ్యాణ్.

    ఈ సందర్భంగానే మీడియా సమావేశంలో నట్టికుమార్ మాట్లాడుతూ... సెన్సార్ బోర్డ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పే ధనలక్ష్మి కొన్ని చిత్రాల విషయంలో మాత్రం నియమాలు పాటించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. 'శకుని' చిత్రం విషయంలో చూసీచూడనట్టుగా వ్యవహరించారామె. అది అనువాద చిత్రమైనప్పటికీ స్ట్రయిట్ చిత్రంగానే పరిగణించి సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ, 'సెగ, మాస్క్' చిత్రాల విషయంలో మాత్రం నిజాయతీగా వ్యవహరిస్తామంటూ.. అనువాద చిత్రాలలానే పరిగణించారు. సి.కళ్యాణ్ చేస్తున్న మోసానికి అశోక్‌కుమార్, సెన్సార్ బోర్డ్ అధ్యక్షురాలు ధనలక్ష్మి సహకరిస్తున్నారు అన్నారు.

    అలాగే...మాములుగా రెండు భాషల్లో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో రెండు చిత్రాలకు సంబంధించిన సీడీలను పరిశీలించాలి. ఆ తర్వాతే అది స్ట్రయిట్ చిత్రమా లేక అనువాద చిత్రమా అని ధృవీకరించి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తారు. కానీ 'శివతాండవం' విషయంలో దీన్ని ఉల్లంఘించారు. చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి అశోక్ కుమార్ దీన్ని స్ట్రయిట్ చిత్రంగా ఆమోదించి, పబ్లిసిటీ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తే, సెన్సార్‌బోర్డ్ క్లీన్ 'యు' సర్టిఫికెట్‌ను ఇచ్చింది. క్షుణ్ణంగా పరిశీలించి ఒకవేళ ఇది అనువాద చిత్రమైతే కళ్యాణ్‌పై తగిన చర్యలు తీసుకోవాలి అని నట్టికుమార్ డిమాండ్ చేసారు.

    ఇక రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినీ రంగం మీద ఆధారపడి బతుకుతున్న కొన్ని వేలమందిని మోసం చేస్తున్నాడు. దక్షిణభారత చలన చిత్ర మండలి అధ్యక్షుడిగా ఉంటూ కళ్యాణ్ ఇలా చేయడం తగదు. అతనిపై సివిల్, క్రిమినల్ కేసు పెట్టాలని ఎఫ్‌డీసీ కమిషనర్ చంద్రవదన్, సినిమాటోగ్రఫి మంత్రి డి.కె.అరుణను కోరుతున్నాను. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను. మంగళవారం నుంచి ఆమరణ నిరదీక్ష చేయాలనుకుంటున్నాను అని చెప్పారు.

    English summary
    “Kalyan is cheating the Board by claiming this dubbed film as a straight Telugu film to evade nearly 12.5% of entertainment tax. UTV Production House which produced Thandavam in Tamil has applied for Censor in Tamil Nadu saying it as a straight Tamil film. How can one film at a time become straight in two languages? Censor Board generally determines one language as Mother Language for any film and considers the rest as dubbed. I have written a letter to Censor Boards, trade bodies of both Telugu and Tamil film Chambers. Being the president of South Indian Film Chamber of Commerce, C. Kalyan is abusing his power," Natti Kumar told media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X