బాలకృష్ణ చిత్రాన్ని ఉద్దేశించే నట్టికుమార్ అలా ప్రశ్నించారా?
షూటింగ్ లు ఆపేసిన సమయంలో కొన్ని చిత్రాలు విదేశాల్లో షూటింగ్ చేసుకొనేందుకు ఎందుకు అనుమతించారు? రీ రికార్డింగులు ఎందుకు చేశారు? లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలి. వీటిపై మా సమావేశంలో చర్చిస్తామంటూ నిర్మాత నట్టికుమార్ మీడియాతో బుధవారం రాత్రి మాట్లాడారు. అయితే నట్టికుమార్ ఏ చిత్రాన్ని ఉద్దేశించి ఈ టాపిక్ ఎత్తాడన్నది హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా ఈ సమ్మె జరుగుతున్న సమయంలో బాలకృష్ణ, దాసరి కాంబినేషన్ లో రూపొందుతోన్న పరమవీరచక్ర చిత్రం విదేశాల్లో పాటల షూటింగ్ జరుపుకుని వచ్చింది.దాంతో దాన్నే దృష్టిలో పెట్టుకుని అన్నారా లేక మరో చిత్రాన్ని ఉద్దేశించి అన్నారా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇక బుధవారం...చలనచిత్ర కార్మికుల సమాఖ్య షూటింగులు చేసేందుకు సిద్ధమే అని స్పష్టం చేసింది. ఈ మేరకు చలనచిత్ర వాణిజ్య మండలికి లేఖను అందజేశారు. వేతన సవరణపై హామీ రావడంతో సమ్మెను విరమించుకొంటున్నామనీ, గురువారం నుంచి షూటింగులకు హాజరవుతామని అందులో తెలిపారు. అయితే ఈ విషయమై తెలుగు చలనచిత్ర నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. దీనిపై చర్చించేందుకు గురువారం ఉదయం హైదరాబాద్‌లో నిర్మాతలు సమావేశం కాబోతున్నారు.


Click it and Unblock the Notifications











