టాలీవుడ్లో మళ్లీ చిచ్చు! నట్టి కుమార్ రాజీనామా
ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ పదవికి నిర్మాత నట్టికుమార్ మంగళవారం రాజీనామా చేశారు. పెద్దనిర్మాలు సహకరించక పోవడం వల్లనే తాను ఈ పదవికి రాజీనామా చేసినట్లు నట్టికుమార్ ప్రకటించారు.
తెలుగు సినిమాకు ఎదురవుతున్న కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాల్ని చర్చించేందుకు ఈ రోజు ఏర్పాటు చేసిన ఫిలిమ్ ఛాంబర్ నిర్మాతల సెక్టార్ సర్వసభ్య సమావేశానికి నిర్మాతలందరూ హాజరు కావాలని ప్రొడ్యూసర్స్ సెక్టార్ కౌన్సిల్ ఛైర్మన్ నట్టి కుమార్ గతంలోనే కోరారు. అయితే ఈ సమావేశానికి పెద్ద నిర్మాతలు రాక పోవడం వల్లనే మనస్థాపానికి గురైన నట్టి కుమార్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
డబ్బింగ్ సినిమాలకు 85 స్క్రీన్స్ మాత్రమే ఇవ్వాలి, థియేటర్లలో తెలుగు సినిమా ప్రదర్శనకు ప్రాధాన్యతనివ్వాలి. ముఖ్యంగా చిన్న సినిమాలను ప్రదర్శించాలి. ఆ తదుపరే డబ్బింగ్ సినిమాలను ఆడనివ్వాలి. పండుగ రోజుల్లో కూడా చిన్న సినిమాలకు అవకాశమివ్వాలి. వాటికి తగినట్లు థియేటర్లను కేటాయించాలి. చిన్న సినిమాలు ప్రదర్శించడానికి ఐదో ఆటకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని కోరాలి. డబ్బింగ్ చిత్రాలపై ప్రస్తుతం ఉన్న వినోదపు పన్నును తమిళనాడు తరహాగా మార్చాలి. థియేటర్ ప్రవేశ రుసుమును చిన్న నిర్మాతలకు రూ.35 నుంచి 100 వరకు సరళంగా వుండే విధంగా పెంచడానికి ప్రభుత్వం అనుమతినివ్వాలి. థియేటర్ రెంట్ ప్రభుత్వ కెపాసిటీ ప్రకారం 13పర్సెంట్ చెల్లించాలి. పర్సెంటేజ్, రెంట్ విధానాల్లో నిర్మాత, పంపిణీదారుల ఇష్ట ప్రకారం సినిమాలు ఆడే స్వేచ్ఛ కూడా ఉండాలన్న... విషయాలను ఈ సమావేశంలో చర్చించాలని నట్టి కుమార్ భావించారు.


Click it and Unblock the Notifications











