twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బద్రినాథ్‌’ఓపెనింగ్స్‌ కోసం ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపణ

    By Srikanya
    |

    త్వరలో రిలీజవుతున్న'బద్రినాథ్‌"ఓపెనింగ్స్‌ కోసం థియేటర్‌ ఓనర్ల (ఎగ్జిబిటర్లు)పై ఆ సినిమా పంపిణీదారులు, నిర్మాతలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, భారీ రేట్లకు టిక్కెట్లు అమ్మాలని ఆజ్ఞాపించారని చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నిర్మాత నట్టి కుమార్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆరోపించారు.

    దీనివల్ల అదే సమయంలో రిలీజయ్యే చిన్న సినిమాలన్నీ తీవ్రంగా నష్టపోతున్నాయని ఆయన అన్నారు.అలాగే ముఖ్యంగా రాయలసీమలో ఒక రోజు 'బద్రినాథ్‌"షోకి థియేటర్‌నుంచి రూ.12-14లక్షలు రాబట్టు కోవాలని యోచిస్తున్నారు.

    భారీగా రూ.500, రూ.600కి టిక్కెట్లు విక్రయించబోతున్నారని తెలిసింది. ఒక్క సినిమా కోసం 10సినిమాల పొట్టకొడుతున్నారు. ఇది అన్యాయం. ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఈ విషయమై ఆలోచించాలి. ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్‌ రేట్లనే అమలు చేయాలి. అనధికారికంగా రేట్లు పెంచితే సంబంధిత థియేటర్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో ప్రజలు ఫిర్యాదు చేయాలి.

    పెద్ద సినిమా చిన్న సినిమా పాలిట శాపం.భారీ సినిమా రిలీజవుతుం దంటే చాలు టిక్కెట్ల రేట్లు బాదేస్తున్నారు. అనధికారికంగా భారీ రేట్లు పెంచి జనాల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. దాంతో పెద్ద సినిమాలు భారీ వసూళ్లు దక్కించు కుని..చిన్న సినిమాను సర్వనాశనం చేస్తున్నాయి అన్నారు నట్టి కుమార్‌.

    English summary
    Allu Arjun's upcoming film Badrinath is all set to hit the screens on June 10th. Directed by V V Vinayak, the film is touted to be one of the most expensive Telugu film ever made.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X