లంచం: చంద్ర బాబుకు సీని నిర్మాత సవాల్
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో లంచాల దందా నడుస్తోందని, ఇందుకు తెలుగు దేశం పార్టీకి చెందిన ఓ మంత్రి దగ్గరుండి ఈ వ్యవహారం నడిపిస్తున్నారని చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడు నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అవినీతిని నిర్మూలిస్తామని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు లంచగొండుల భరతం పట్టాలని నట్టి కుమార్ సవాల్ విసిరాడు.

2006 నుండి 2012 వరకు ఉన్న సర్వీస్ టాక్స్ మాఫీ చేయిస్తామని ఒక్కో థియేటర్ యజమాని నుండి రూ. 50వేల చొప్పున లంచం వసూలు చేసారని, తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ మంత్రి అనుచరులైన అశోక్ కుమార్, గోవిందరాజు ఈ వసూళ్లు చేస్తున్నారని, తెలుగు సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లయిన ఎన్వీ ప్రసాద్, పూర్వి రాజు, చిన్ని, జనార్ధన్, అలంకార్ ప్రసాద్ తదితరులు ఈ ముఠాలో ఉన్నారని నట్టి ఆరోపించారు.
అవినీతిని నిర్మూలిస్తానని చెబుతున్న చంద్ర బాబు వెంటన వీరిపై చర్యలు తీసుకోవాలని, లంచాలు తీసుకున్న వారిని అరెస్టు చేయించాలని నట్టి కుమార్ డిమాండ్ చేసారు. నట్టి కుమార్ లాంటి వ్యక్తి ఇంత మంది పేర్లు మీడియా ముందు చెప్పారంటే....తెర వెనక ఏదో జరిగే ఉంటుందని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజా నిజాలు తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











