దాసరిని ఫాలో అవుతానంటున్నాడు
అర్ధరాత్రి సహాయం కోరినా మా గురువు దాసరిగారు చేయడానికి వెనుకాడరు.ఆయన అడుగు జాడలనే నేను కూడా ఫాలో అవుతా అంటున్నారు నిర్మాత నట్టికుమార్. ఆయన రీసెంట్ గా జరిగిన రాష్ట్ర తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికలలో నిర్మాతల విభాగానికి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అధిక మెజార్టీతో గెలిచినందుకు ఆనందంగా ఉందని శనివారం మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.అలాగే.. ''289 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. చిన్న సినిమాలకు ప్రయోజనం చేకూరే పనులు చేస్తాననే నమ్మకంతో నన్ను ఎన్నుకున్నారు. ప్రభుత్వం నుంచి చిన్న సినిమాలకు సబ్సిడీ రావడంలేదు. అలాగే థియేటర్ల అద్దె పెరగడంతో చిన్న సినిమాలు ఆడటం ఇబ్బంది అవుతోంది. క్యూబ్, ఇఎఫ్‌ఒ, పిఎస్‌డి విధానాలు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్లు రెంట్లు పెంచారు. చిన్న సినిమాలకు 35 ప్రింట్లే ఆమోదిస్తున్నారు. వాటిని 70 ప్రింట్లకు పెంచాలి అన్నారు.ఇక నట్టికుమార్ ఇప్పుడు జగపతిబాబు, శ్రీహరి,రాజ శేఖర్ లతో చిత్రాలు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











